మైదుకూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా మైదుకూరు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. గోపవరం మండలం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాధాకృష్ణారెడ్డి కె.రాధాకృష్ణారెడ్డి మైదుకూరులో జరిగే వివాహ వేడుకకు జీపులో వస్తుండగా జాండ్లవరం క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాధాకృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. జీపు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రాధాకృష్ణారెడ్డి స్వగ్రామం గోపవరం మండలం సండ్రుపల్లి గ్రామం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.