అరవపల్లి(సూర్యాపేట జిల్లా): చేతబడి చేస్తున్నాడనే నెపంతో గ్రామస్తులు ఓ కుటుంబంపై దాడికి దిగారు. ఈ సంఘటన అరవపల్లి మండలం తుంగగూడెంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన చిలుకూరి సోమయ్య(54) అనే వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేశారు.
దాడిని అడ్డుకోబోయిన సోమయ్య భారతమ్మ, కుమారుడు రమేశ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సోమయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా..చికిత్సపొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చేతబడి నెపంతో దాడి..ఒకరి మృతి
Published Wed, Dec 7 2016 8:16 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
Advertisement
Advertisement