witch craft
-
అనుమానం వచ్చింది.. అంతే వాళ్లని చెట్టుకు కట్టేసి..
సదాశివపేటరూరల్ (సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని కొల్కూర్ గ్రామంలో మంత్రాల(చేతబడి) నెపంతో గ్రామస్తులు శనివారం ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. సదాశివపేట సీఐ నవీన్ కుమా ర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన ముత్తంగి యాదయ్య కుటుంబం చేతబడి చేస్తోందనే అనుమానంతో గ్రామానికి చెందిన శివ య్య, లక్ష్మణ్, కోవూరి కుమార్, గడ్డం పెంటయ్య, బాగప్ప, బెగరి కుమార్, గడ్డం శ్యామల, గడ్డం ఆగమ్మ తదితరులు కలిసి యాదయ్య కుటుంబాన్ని తాళ్లతో చెట్టుకు కట్టేసి కట్టెలతో దాడి చేశారు. కొందరు గ్రామస్తులు నిలువరించడంతో యాదయ్య, ఆయన భార్య అమృత, కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దళితులపై మంత్రాలనెపంతో దా డి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్, జిల్లా అధ్యక్షుడు అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదవండి: బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు... -
ప్రతీకారం.. ప్లాన్ ప్రకారం అతిగా మద్యం తాగించి మత్తులోకి జారుకోగానే..
వేలేరుపాడు(పశ్చిమ గోదావరి): ప్రపంచం అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నా.. గిరిజన ప్రాంతాల్లో మాత్రం మూఢనమ్మకాలు తొలగిపోవడం లేదు. అందుకు ఉదాహరణే వేలేరుపాడు మండలంలోని కొర్రాజులగూడెంలో గ్రామంలో జరిగిన కారం రాజులు(57) హత్య. చేతబడి అనుమానంతో గ్రామానికి చెందిన కొందరు అతనిని హత్య చేయగా ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్రాజులగూడెంకు చెందిన నూపా లక్ష్మయ్య ఆగస్టు నెలలో అనారోగ్యంతో మృతి చెందాడు. తన భర్త మృతికి కారం రాజులు చేతబడే కారణమని, భార్య నూపా దుర్గమ్మ భావించింది. రాజులపై ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేసింది. వరుసకు కొడుకయ్యే నూపా పెంటయ్య, కొడుకు వంశీతో కలిసి హత్యకు స్కెచ్ వేసింది. ఈ నెల 17న రాత్రి గ్రామంలోని పొలంలో ఉన్న రాజులు వద్దకు పెంటయ్యను పంపింది. పెంటయ్య, రాజులు కలిసి అతిగా మద్యం సేవించారు. రాజులు మత్తులోకి జారుకున్నాక దుర్గమ్మ, పెంటయ్య, వంశీ అక్కడికి వచ్చారు. ముందుగా రాజులు తలపై కొట్టి, మొఖంపై గట్టిగా మోదారు. దీంతో రాజులు మృతి చెందాడు. ఈ విషయం 19న వెలుగులోకి వచ్చింది. అదే రోజున గ్రామస్తులు, దహన సంస్కారాలు కూడా చేశారు. ఆనంతరం కూతురు కారం రజిని 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు. శుక్రవారం నిందితులైన దుర్గమ్మ, పెంటయ్యను అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. చదవండి: భర్తతో విడాకులు, మరో వ్యక్తితో ప్రేమ, ప్రియుడు నిర్లక్ష్యం చేస్తున్నాడని -
ఇంటి మేడపై నిమ్మకాలు, పసుపు, కుంకుమ.. భయంతో..
ధారూరు(వికారాబాద్): చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై కొందరు దాడి చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని గురుదోట్ల గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(35) కొంతకాలంగా బాణామతి, చేతబడి చేస్తున్నాడని స్థానికులు అనుమానించసాగారు. ఈక్రమంలో ఓ ఇంటి మేడతోపాటు మరో వ్యవసాయ పొలంలో నిమ్మకాలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, ఇతర పూజాసామగ్రి పడటంతో వారి అనుమానం మరింత బలపడింది. ఈమేరకు సోమవారం ఉదయం కొందరు వ్యక్తులు కలిసి సదరు వ్యక్తిని పట్టుకుని నిలదీశారు. తనకు ఎలాంటి పాపం తెలియదని ఆయన వాగ్వాదానికి దిగడంతో ఆగ్రహానికి గురై చితకబాదారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు మంగళవారం గొడవపై ఆరా తీశారు. పోలీసులు కేసులు నమోదు చేస్తారనే భయంతో ఇరువర్గాలు రాజీపడ్డారు. అనంతరం ఇరువర్గాలకు చెందిన వారు ఓ గుడి వద్ద కూర్చుని చర్చించుకొని రాజీపై పోలీసులకు సర్దిచెప్పుకొన్నారని సమాచారం. చదవండి: Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య -
మంత్రాలు చేస్తున్నారనే అనుమానం.. 30 మంది గ్రామస్తులు కలిసి..
భువనేశ్వర్: ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులంతా కలిసి ఒక కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఈ అవమానవీయకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన గంజాం జిల్లాలోని బెర్హంపూర్‌లో జరిగింది. కాగా, పోలసర గ్రామానికి చెందిన బిమల్ నాయక్(45), చిరికిపాడ సాసన్ వద్ద మంత్రాలు చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. అందుకే, గడిచిన నెలన్నర కాలంలో సాసన్లో.. 6 గురు చనిపోయారని తెలిపారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులంతా కలిసి నిన్న(ఆదివారం) మూకుమ్మడిగా బిమల్‌నాయక్ ఇంటిపై దాడిచేశారు. అతడిని బయటకులాగి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన వినలేదు. గ్రామస్తుల దాడిలో నాయక్ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న చిరికిపాడ పోలీసులు నాయక్‌ను, అతని కుటుంబ సభ్యులను బెర్హంపూర్‌లోని ఎంకేసీఐ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు 30 మంది గ్రామస్తులపై కేసును నమోదుచేసి, 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, పరారీలో ఉన్న మరికొంత మంది కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని బెర్హంపూర్ పోలీసు అధికారి సూర్యమణి ప్రధాన్ తెలిపారు. -
గుప్తనిధుల కోసం ఇల్లాలినే చంపారు
హైదరాబాద్: గుప్త నిధులు దక్కుతాయనే మూఢనమ్మకం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్నభర్త, కన్నకొడుకే ఈ దారుణానికి ఒడిగట్టారు. నగర నడిబొడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజ్‌భవన్ ఎదురుగా ఉన్న ఎంఎస్‌మక్తాలో గురువారం అర్థరాత్రి అఫ్జల్ బేగం అనే మహిళను ఆమె భర్త, కొడుకు కలిసి గొంతుకోసి చంపారు. గుప్త నిధుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. నిందితులు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పంజాగుట్ట పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. -
చేతబడి నెపంతో దాడి..ఒకరి మృతి
అరవపల్లి(సూర్యాపేట జిల్లా): చేతబడి చేస్తున్నాడనే నెపంతో గ్రామస్తులు ఓ కుటుంబంపై దాడికి దిగారు. ఈ సంఘటన అరవపల్లి మండలం తుంగగూడెంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన చిలుకూరి సోమయ్య(54) అనే వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేశారు. దాడిని అడ్డుకోబోయిన సోమయ్య భారతమ్మ, కుమారుడు రమేశ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సోమయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా..చికిత్సపొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మంత్రాల నెపంతో దాడి
కృష్ణా: క్షుద్రపూజలు చేస్తున్నారన్న ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను గ్రామస్తులు చితకబాదారు. ఈసంఘటన కృష్ణా జిల్లా వామకుంట్లలో శుక్రవారం ఉదయం నెలకొంది. గ్రామ పొలిమేరలో చేతబడి పేరుతో గురువారం అర్ధరాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు క్షద్ర పూజలు చేస్తున్నరని ముగ్గురు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ది చేశారు. వీరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారిని పోలీస్ స్టేషన్ తరలించే సమయంతో విషయం తెలుసుకున్న మరికొంత మంది గ్రామస్తులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీన్ని మామూలు కేసుగా కాకుండా వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.