bike rolls
-
చెట్టును ఢీకొన్న ద్విచక్రవాహనం
కుందుర్పి: ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... శెట్టూరు మండలం బొచ్చుపల్లికి చెందిన మల్లప్ప (46) తన మిత్రుడు తిప్పేస్వామితో కలిసి బుధవారం ద్విచక్రవాహనంలో బెస్తరపల్లి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరుగుతున్న వివాహానికి బయల్దేరాడు. బెస్తరపల్లి వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. మల్లప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన తిప్పేస్వామిని స్థానికులు కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. మృతుడు మల్లప్పకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎనిమిదేళ్లుగా భార్య దూరంగా ఉంటోంది. ఎస్ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం
- రక్షణ కంచెను ఢీకొన్న బైక్ - బావ, బామ్మర్ది దుర్మరణం - మరొకరి పరిస్థితి విషమం చిలమత్తూరు (హిందూపురం) : చిలమత్తూరు మండలం శెట్టిపల్లి పంచాయతీ కమ్మయ్యగారిపల్లి క్రాస్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బావ, బామ్మరిది దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, ఎస్ఐ జమాల్‌బాషా తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బత్తలపల్లికి చెందిన బాబావలి (23), అనుప్రియ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత పనిమీద బాబావలి భార్య అనుప్రియ, బామ్మరిది అభి (13)తో కలిసి హీరోహోండా బైక్‌పై బత్తలపల్లి నుంచి బెంగళూరుకు బయల్దేరాడు. 44వ నంబరు జాతీయరహదారిలోని కమ్మయ్యగారిపల్లి తండా క్రాస్‌లో మలుపు వద్ద బైక్ అదుపు తప్పి రక్షణ కంచెలా ఏర్పాటు చేసిన ఇనుప ప్లేట్లను ఢీకొంది. అభి ఇనుపప్లేట్ల మధ్యలోకి దూసుకెళ్లి అక్కడే ప్రాణం విడిచాడు. తీవ్రంగా గాయపడిన బాబావలి దంపతులను బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబావలి మృతి చెందాడు. కాళ్లు విరిగి, చేతులు, తలకు బలమైన గాయాలు తగిలిన అనుప్రియ పరిస్థితి కూడా విషమంగా ఉందని ఎస్ఐ తెలిపారు. -
బైక్ అదుపు తప్పి ఒకరి దుర్మరణం
బుక్కరాయసముద్రం (శింగనమల) : బుక్కరాయసముద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక గాంధీనగర్‌కు చెందిన శ్రీనివాసులు(45) అనే వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు. బైక్‌లో అనంతపురానికి బయలుదేరగా కేవీకే ఫ్యాక్టరీ సమీపానికి రాగానే అదుపు తప్పికింద పడటంతో తలకు బయలమైన గాయాలయ్యాయన్నారు. వెంటనే 108లో అనంతపురం పెద్దాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
కళ్లెదుటే.. కన్నుమూశాడు!
- ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి - మరొకరికి తీవ్ర గాయాలు పెద్దపప్పూరు : వేగంగా బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి గోతిలోకి ఎగిసిపడ్డారు. మొనలు తేలిన భారీ బండరాళ్లపై పడటంతో వారిద్దరికీ బలమైన గాయాలు తగిలాయి. ఈ ప్రమాదంలో అచేతనంగా కూర్చుండిపోయిన ఓ వ్యక్తిని చూసిన స్థానికులు నీళ్లు తాపారు. కాసేపు బండరాయికి ఆనుకుని సేద తీరుతున్నట్లు కనిపించిన ఆ వ్యక్తి అందరూ చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో ప్రాణం వదిలాడు. కళ్లముందే ప్రాణాలు పోతున్నా..‘అయ్యో’ అనడం తప్ప..అక్కడున్నవారు ఏమీ చేయలేకపోయారు. మండల పరిధిలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలోని కనుమ వద్ద ద్విక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీహర్ష తెలిపిన వివరాల మేరకు కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం ఓబన్నపేట ఎల్లయ్య (50), కొర్రపాడుకు చెందిన రామాంజి వ్యక్తిగత పని నిమిత్తం అనంతపురానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో కనుమ వద్దకు రాగానే బైకు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా, రామాంజి తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన రామాంజిని 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఎల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ శ్రీహర్ష ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.