![-](/styles/webp/s3/article_images/2024/11/4/132.jpg.webp?itok=cxr6eicL)
మంత్రి పర్యటనలో కనిపించని ఆరణి
ఎమ్మెల్యే కోసం ఆరా తీసిన మంత్రి
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎమ్మెల్యే ఎక్కడ? అని మంత్రి నాదేండ్ల జనసేనులను ఆరా తీశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జనసేన పార్టీకి చెందిన ఏకై క ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అదే జనసేన పార్టీలో నంబర్ 2గా ఉన్న పౌరసరఫరాల మంత్రి, పీఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహర్ రెండు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటించారు.
తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంత్రి పర్యటనకు డుమ్మా కొట్టారు. సూపర్ సిక్స్ పథకాల్లోని దీపం–2 పథకం కార్యక్రమాన్ని శనివారం జిల్లా కేంద్రమైన తిరుపతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హాజరు కావాల్సిఉంది.
అయినా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాలేదు. అలాగే మంత్రి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనూ స్థానిక ఎమ్మెల్యే లేరు. మంత్రి తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంలో నాదేండ్ల మనోహర్ జనసేన జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. జిల్లా నాయకులంతా హాజరైనా ఒక్కగానొక్క జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాకపోవడంతో మంత్రి నాదేండ్ల మనోహర్ ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment