మున్నయ్య కుటుంబానికి ఆర్థిక సాయం | Rs 2 lakh ex-gratia to suicide hit family | Sakshi
Sakshi News home page

మున్నయ్య కుటుంబానికి ఆర్థిక సాయం

Published Sat, Sep 7 2013 10:25 AM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM

Rs 2 lakh ex-gratia to suicide hit family

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆత్మహత్యకు పాల్పడిన వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని ఆర్టీసీ కార్మికుడు మున్నయ్య కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,శ్రీనివాసులు  శనివారం పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి వెన్నంటే ఉంటామని వారు భరోసా ఇచ్చారు.

 

వైఎస్ఆర్ పార్టీ నేత రచమళ్ల ప్రసాద్రెడ్డి ఈ సందర్భంగా రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని మున్నయ్య కుటుంబానికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రం ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో  ఆర్టీసీ కార్మికుడు మున్నయ్య తీవ్ర కలత చెందాడు. ఆ క్రమంలో తన సహుద్యోగుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఆంధ్రప్రదేశ్ విభజన ఇక తప్పదనే అభిప్రాయం సర్వత్ర వస్తున్న నేపథ్యంలో మున్నయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement