మున్నయ్య కుటుంబానికి ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆత్మహత్యకు పాల్పడిన వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని ఆర్టీసీ కార్మికుడు మున్నయ్య కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,శ్రీనివాసులు శనివారం పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి వెన్నంటే ఉంటామని వారు భరోసా ఇచ్చారు.
వైఎస్ఆర్ పార్టీ నేత రచమళ్ల ప్రసాద్‌రెడ్డి ఈ సందర్భంగా రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని మున్నయ్య కుటుంబానికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రం ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ కార్మికుడు మున్నయ్య తీవ్ర కలత చెందాడు. ఆ క్రమంలో తన సహుద్యోగుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఆంధ్రప్రదేశ్ విభజన ఇక తప్పదనే అభిప్రాయం సర్వత్ర వస్తున్న నేపథ్యంలో మున్నయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు.