ఆడ బిడ్డలు పుట్టారని.. | second Married her husband | Sakshi
Sakshi News home page

ఆడ బిడ్డలు పుట్టారని..

Published Mon, Mar 27 2017 3:28 AM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

ఆడ బిడ్డలు పుట్టారని..

ఆడ బిడ్డలు పుట్టారని..

∙రెండో పెళ్లి చేసుకున్న భర్త
∙నిలదీసిన భార్యపై దాడి


మదనపల్లె క్రైం : ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారని, మగ బిడ్డ కావాలని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య నిలదీయడంతో రాళ్లతో దాడి చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం మేరకు... పీటీఎం మండలం చలిమామిడికి చెందిన నరసింహులు, ఉత్తమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీనరసమ్మను 15 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా కదిరి పట్టణం బాలప్పగారి క్వార్టర్స్‌లో ఉంటు న్న సత్తెన్న, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు ఎస్‌.శ్రీనివాసులుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. మగ బిడ్డ లేకపోవడంతో శ్రీనివాసులు రెండో పెళ్లి చేసుకోవాలని ఏడాదిగా భార్యను వేధిస్తున్నాడు. ఆమె బిడ్డల కోసం వేధింపులను భరిస్తూ వచ్చింది.

నెలరోజుల క్రితం శ్రీనివా సులు అదే జిల్లా గాండ్లపెంట మండలం ఎర్రజేనుకు చెందిన లక్ష్మి అనే యువతిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. నాలుగు రోజుల క్రితం భర్తను నిలదీయడంతో అతను ఆమెపై ఇటుక రాళ్లతో విచక్షణ రహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వారు గమనించి బాధితురాలిని పుట్టింటికి పం పించారు. తీవ్ర గాయాలతో అవస్థలు పడుతున్న బిడ్డను చూసి తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. అనంతరం వారు పీటీఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement