రాజమండ్రి : పోలీసు ఎస్కార్ట్ నుంచి శ్రీనివాసులు అనే రిమాండ్ ఖైదీ తప్పించుకుని పరారయ్యాడు. ఈ సంఘటన రాజమండ్రిలో షెల్టన్ హోటల్ సమీపంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఓ కేసు విషయమై శ్రీనివాసులును రాజమండ్రి నుంచి కడప జిల్లా కోర్టుకు తరలించారు.
కోర్టులో హజరుపరిచి తిరిగి రాజమండ్రి తీసుకువస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని చెప్పిన శ్రీనివాసులు... పోలీసులు ఏమరుపాటుగా ఉన్న సమయంలో పలాయనం చిత్తగించాడు. తప్పించుకున్న ఖైదీ శ్రీనివాసులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.