సూళ్లూరుపేట : కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుండే విషయం మనకు తెలిసిందే. తాజాగా అదే కల్తీ మద్యానికి ఓ ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ సహా ఇద్దరు మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.
సూళ్లూరుపేటలో ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పంతంగి శ్రీనివాసులుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు సుధాకర్, రామ్మూర్తిలు రోజులాగే మంగళవారం సాయంత్రం మద్యం తాగారు. మత్తు ఎక్కువగా వచ్చేందుకు మద్యంలో రసాయనాలు కలుపుకుని తాగడం వారికి అలవాటు. మంగళవారం సాయంత్రం మద్యం సేవిస్తూ ఆ రసాయనాన్ని ఎక్కువగా కలుపుకుని తాగడంతో ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు అక్కడిక్కడే మృతిచెందాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సుధాకర్ను చెన్నై తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మరో వ్యక్తి రామ్మూర్తి స్థానిక ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
కల్తీ మద్యానికి ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ బలి
Published Tue, Mar 29 2016 7:44 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement