కల్తీ మద్యం తాగి.. 20 మంది మృతి | Several Deceased After Consuming Spurious Liquor In Bihar As Per Siwan SP Amitesh Kumar, More Details Inside | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం తాగి.. 20 మంది మృతి

Published Thu, Oct 17 2024 11:01 AM | Last Updated on Thu, Oct 17 2024 12:30 PM

several deceased After Consuming Spurious Liquor in bihar

పట్నా: బిహార్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. మంగళవారం రాత్రి బిహార్‌లోని సివాన్‌, సారణ్‌ జిల్లాల్లో  కల్తీ మద్యం తాగిన పలువురు తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించగా.. బుధవారం నాటికి మృతుల సంఖ్య 6కు చేరింది. అయితే ఇవాళ మృతుల సంఖ్య 20కి చేరిందని ఎస్పీ శివన్ అమితేష్ కుమార్‌ వెల్లడించారు.

 

భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లోని భగవాన్‌పూర్ ఎస్‌హెచ్‌ఓ, ప్రొహిబిషన్ ఏఎస్‌ఐపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇంకా.. పలువురు కల్తీ మద్యం బాధితులకు హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సుమారుగా 73 మందికి పైగా  కల్తీ మద్యం తాగినట్లు తెలుస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement