అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ప్రొద్దుటూరు క్రైం: గణేష్ నిమజ్జనం విధుల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ శ్రీనివాసులు (31) గుండె పోటుతో మృతి చెందాడు. కానిస్టేబుల్ అంత్యక్రియలు గురువారం ఆర్టీపీపీ రోడ్డులోని శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. బద్వేల్‌కు చెందిన శ్రీనివాసులు 2007లో ప్రొద్దుటూరుకు చెందిన ప్రమీలతో వివాహమైంది. వారికి దీపక్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసులు 2006లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతను ఏపీఎస్పీ 14 బెటాలియన్ అనంతపురంలో పని చేస్తున్నాడు.
బంధువులందరూ ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌లో ఉండటంతో అక్కడే ఉన్నారు. శ్రీనివాసులు విధుల్లో భాగంగా వినాయ క నిమజ్జనం బందోబస్తు కోసం వారం రోజుల కిందట హైదరాబాద్‌కు వెళ్లాడు. లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. యూసఫ్‌గూడాలో నివసించే తన స్నేహితుడు రంజిత్‌కుమార్ వద్దకు ఈ 9న రాత్రి వెళ్లాడు. అక్కడ రంజిత్‌కుమార్‌తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. గాయ పడిన శ్రీనివాసులును వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండె పోటుతో మృ తి చెంది ఉంటాడని వైద్యులు చెప్పారు.
పోస్టుమార్టం అనంతరం శ్రీనివాసులు మృతదేహాన్ని బుధవారం రాత్రి ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. మృతదేహం చూడగానే భార్య ప్రమీల బోరున విలపించింది. గురువారం ఉదయం శ్రీనివాసనగర్ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఆర్టీపీపీ రోడ్డులోని శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అసిస్టెంట్ కమాండెంట్ కేవశరెడ్డి, రిజర్వు ఇన్‌స్పెక్టర్ రామచంద్రారెడ్డి, త్రీ టౌన్ ఎస్‌ఐ మహేష్. బెటాలియన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.