అనంతపురం: అనంతపురం పట్టణంలో ఇంజనీరింగ్‌లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడని మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురంలో శనివారం జరిగింది. వివరాలు.. పట్టణంలోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీనివాసులు (22) ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా, ఇంజనీరింగ్‌లో కొన్ని సబ్జెక్టుల్లో తప్పడంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే శనివారం తోటి విద్యార్థులందరు కాలేజీకి వెళ్లిన అనంతరం హాస్టల్ గదిలో నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.
కాలేజీ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులు తలుపు తీయకపోవడంతో బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఉరికి వెళాడుతున్నాడు. అనంతరం స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.