చార్జర్‌ వైర్‌తో చంపేశారు... | AP: Suspects Arrested In Rahul Assassination Case | Sakshi
Sakshi News home page

చార్జర్‌ వైర్‌తో చంపేశారు...

Published Sat, Aug 28 2021 3:46 AM | Last Updated on Sat, Aug 28 2021 8:59 AM

AP: Suspects Arrested In Rahul Assassination Case - Sakshi

మాట్లాడుతున్న పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు 

గుణదల (విజయవాడ తూర్పు): ఏపీలో సంచలనం రేకెత్తించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. సెల్‌ఫోన్‌ చార్జర్‌ వైర్‌ మేడకు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి రాహుల్‌ను చంపేశారని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కీలక ఆధారాలు సేకరించి, పలువురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను కమిషనర్‌  శుక్రవారం మీడియాకు వివరించారు. 

ఆర్థిక లావాదేవీలే ముఖ్య కారణం.. 
కోరాడ విజయ్‌కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్‌ఫండ్‌ కంపెనీ నడుపు తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో  విజయ్‌కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన  ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్‌ఫండ్‌ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్‌కుమార్‌ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్‌ సిలెండర్స్‌ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్‌కుమార్‌  రాహుల్‌ను కోరాడు.

అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్‌పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్‌కుమార్‌ స్నేహితురాలు గాయత్రికి రాహుల్‌ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్‌ సిలెండర్స్‌ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్‌ బిజినెస్‌లో కాంట్రాక్ట్‌ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చపోవడంతో రాహుల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్‌ హత్యకు దారితీశాయి. 

నిందితుల అరెస్టు..
మృతుని తండ్రి కరణం రాఘవరావు మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పది రోజుల వ్యవధిలోనే కీలక ఆధారాలు సేకరించి, పరారీలో ఉన్న నిందితుల్లో ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement