బుక్కపట్నం : చింతలయ్యగారిపల్లి రైతు శ్రీనివాసులు తన ఇంటి వెనుక ఉంచిన ట్రాక్టర్‌ను శుక్రవారం రాత్రి పొద్దుపోయాక దుండగులు అపహరించారు. ట్రాలీని వదిలేసి ఇంజిన్‌ను తీసుకెళ్లారు. శనివారం వరకు ఎన్ని చోట్ల వెతికినా జాడ కనిపించక పోవడంతో బాధిత రైతు ఆదివారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ యతీంద్ర విలేకరులకు తెలిపారు.