విషజ్వరంతో భార్య మృతిచెందడంతో మనస్థాపం చెందిన భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
చెన్నూరు: విషజ్వరంతో భార్య మృతిచెందడంతో మనస్థాపం చెందిన భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో బుధవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు... చెన్నూరు పుప్పాల హనుమాన్ వీధికి చెందిన స్రవంతి, శ్రీనివాసులుకు ఏడాది క్రితం వివాహం అయింది. విషజ్వరంతో స్రవంతి రెండు రోజుల క్రితం మృతి చెందింది. భార్య ఎడబాటుతో మనస్థాపం చెందిన శ్రీనివాసులు బుధవారం మధ్యాహ్నం మంచిర్యాల వెళ్లి అక్కడ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల వ్యవధిలో దంపతులుద్దరూ మృతిచెందడంతో స్థానికంగా విషాదం అలముకుంది.