Chennuru
-
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉద్రిక్తత
-
కాంగ్రెస్ కు బాసులు ఢిల్లీలో ఉన్నారు, బీఆర్ఎస్ కు ప్రజలే బాసులు
-
చెన్నూర్‌లో పోలింగ్‌కు ముందురోజు షాక్..?
మంచిర్యాల, చెన్నూర్: చెన్నూర్ టీఆర్ఎస్లో పోలింగ్‌కు ముందు ముసలం మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అభ్యర్థిగా అర్చనరాంలాల్‌గిల్డాను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రకటించారు. దీంతో ఆరో వార్డుకు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ సర్పంచ్ కృష్ణ భార్య సాధనబోయిన లావణ్య తన ఇంటివద్దే కృష్ణ మద్దతుదారులు నిరసనకు దిగారు. మొన్నటివరకు లావణ్యను చైర్‌పర్సన్‌గా ప్రకటిస్తానని చెప్పి ఇప్పుడు బాల్క సుమన్ మాట తప్పారని కృష్ణ వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ కృష్ణ ఇంటికి వచ్చి నిరసన నిలిపివేయాలని చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్‌తో సయోధ్య కుదుర్చుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. దీంతో కృష్ణ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు ఆరో వార్డులో చేస్తున్న పోటీనుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని విలేకరుల ఎదుట ప్రదర్శించారు. చెన్నూర్ మున్సిపాలిటీలో 18 వార్డులకు ఏడు వార్డులు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యేందుకు చక్రం తిప్పిన విప్ సుమన్.. తిరుగులేని నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. చైర్పర్సన్ ప్రకటన చేయడంతో సొంత పార్టీలోనే నిరసన ప్రారంభం కావడం విశేషం. అలక వీడిన అభ్యర్థి నిరసనకు దిగిన అభ్యర్థిని ఇంటికి ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ మరోమారు వెళ్లి వారిని సముదాయించారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక.. చైర్పర్సన్ ఎంపికకు ఈనెల 28వరకు సమయం ఉండడంతో ఆలోపు ఆలోచిద్దామని, అప్పటివరకు వేచి ఉండాలని సూచించారు. విప్ సుమన్ ఇదే విషయం తెలిపారని పేర్కొన్నారు. దీంతో సదరు అభ్యర్థి అలకవీడి.. రాజీనామా వెనక్కి తీసుకున్నారు. -
మూడేళ్లకే తెగిన మూడుముళ్ల బంధం
సాక్షి, చెన్నూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ దళిత యువతి భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెన్నూరు మండలం కొండపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని కొండపేట దళితవాడకు చెందిన ఏటూరి శిరీష (20), అదే గ్రామంలోని అగ్రకులానికి చెందిన ఆదినేని సుబ్రమణ్యంలు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించకపోవడంతో 2017లో సుబ్రమణ్యం శిరీషను వివాహం చేసుకుని వేరుగా నివాసం ఉంటున్నాడు. అప్పట్లో శిరీష తల్లిదండ్రులు తమ కుమార్తె తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసుకూడా నమోదైంది. అనంతరం కొద్దిరోజుల తర్వాత శిరీష, సుబ్రమణ్యంలు కొండపేటకు చేరుకుని స్థానికంగా నివాసముండేవారు. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసగా మారిన సుబ్రమణ్యం నిత్యం భార్యతో గొడవపడుతూ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకు రావాలని వేధించేవాడు. ఈ క్రమంలో తాజాగా శనివారం కూడా భార్యభర్తలు గొడవ పడ్డారు. దీంతో పుట్టింటికి వెళ్లిన శిరీషాను భర్త కొండపేటకు తీసుకొచ్చాడు. భర్త వేధింపులతో విసిగి వేశారిపోయిన ఆమె శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. డీఎస్పీ విచారణ : కడప డీఎస్పీ మాసుంబాషా ఆదివారం మండలంలోని కొండపేటకు వెళ్లి సంఘటన గురించి మృతురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం చెన్నూరు పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఘటనపై విచారించారు. -
నా భవిష్యత్తును కేసీఆర్ చేతిలో పెట్టాను
-
వైద్యుడి అవతారమెత్తిన చాయ్‌వాలా!
చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో లతీఫ్ అనే టీ హోటల్ యజమాని వైద్యుడి అవతారమెత్తాడు. వైద్యులు, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రోగులకు సెలైన్లు ఎక్కించాడు. శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. నెల రోజులుగా చెన్నూర్, కోటపల్లి మండలాల్లో వైరల్, డెంగీ జ్వరాలు ప్రబలి ప్రజలు ఆస్పత్రికి వస్తున్నారు. ఆస్పత్రిలో నలుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు. ఓ వైద్యుడు డిప్యూటేషన్‌పై వెళ్లాడు. ఆరుగురు స్టాఫ్‌నర్సులకు గాను ఒకరు బదిలీ కాగా, మరొకరు డిప్యూటేషన్‌పై మరో ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం నలుగురు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు వార్డుబాయ్‌లు ఉన్నారు. వీరంతా మూడు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం రాత్రి జ్వరంతో వచ్చిన బాలుడికి ఆస్పత్రి ఎదుట ఉండే టీ స్టాల్ యజమాని లతీఫ్ సెలైన్ ఎక్కించాడు. ఇతడికి అంబులెన్స్ ఉండడం, రోగులకు పాలు, టీలు సరఫరా చేస్తుండడంతో ఆస్పత్రి సిబ్బందితో సమానంగా వ్యవహరిస్తుంటాడు. వైద్య సిబ్బందితో ఉన్న చొరవ కారణంగా సెలైన్లు ఎక్కిస్తుంటాడని తెలిసింది. కాగా, ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణను సంప్రదించగా.. సిబ్బంది కొరత వాస్తవమేనని, లతీఫ్ సెలైన్ ఎక్కించలేదని, సెలైన్ బాటిళ్లు ఇవ్వడానికి బెడ్ వద్దకు వెళ్లాడని తెలిపారు. -
నకిలీ జ్యోతిష్యుడి ఆటకట్టు
చెన్నూరు : ‘మీకు శనిదోషం ఉంది. మృత్యు కళ ముఖంలో కనపడుతుంది. వారం రోజుల్లో చనిపోతారు. ఎంత డబ్బు వచ్చినా రాహుకాల దోషం వల్ల నిలవడటం లేదు. అందుకు విరుగుడుగా తాయత్తు కట్టాలి. ఇంటికి దోష పరిహారం చేయాలి. లేకపోతే చాలా అరిష్టం’ అంటూ ప్రజలను భయపెట్టి, మోసం చేస్తున్న నకిలీ జ్యోతిష్యుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన చెన్నూరులోని సరస్వతినగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడపకు చెందిన రామాంజనేయులు15 రోజులుగా కాటి కాపరుడి వేషం వేసుకొని గ్రామంలో తిరుగుతూ పురుషులు లేని ఇంటిలోకి నేరుగా వెళ్తాడు. మహిళలకు జ్యోతిష్యం పేరుతో మాయమాటలు చెప్పి, భయపెట్టి వారి వద్దనున్న సొమ్మును దోచుకునే వాడు. ఒంటిరిగా ఉన్న వారిని మభ్యపెట్టి తాయత్తు కచ్చితంగా వేసుకో, మంచి జరుగుతుందని, లేకపోతే అరిష్టం అంటూ చెప్పేవాడు. దీంతో భయపడి తాయత్తు వేయించుకొంటే రూ. 200 నుంచి రూ.500 వరకు తీసుకునే వాడు. దుకాణాల వద్దకు వచ్చి బెదిరించే వాడు. మద్యం సేవించి, దక్షిణ వేయాలని లేకపోతే మీ కథ చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో సరస్వతీనగర్‌కు చెందిన ప్రజలు శుక్రవారం విషయాన్ని పోలీసులకు చెప్పారు. అతన్ని వారు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సాయంత్రం వరకు పెట్టుకుని, అతని వద్ద ఉన్నది దోచుకొని పంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఏఎస్ఐ యల్లంరాజును ‘సాక్షి’ వివరణ కోరగా.. ప్రజలు కాటికాపారుడిని అప్పగించిన విషయం వాస్తవమేనని, అతన్ని మందలించి పంపామని తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
చెన్నూరు : స్థానిక పడమటి వీధిలో నివాసం ఉండే కాలహస్తి నాగరాజు భార్య లక్ష్మిదేవి(42) గురువారం ఇంటిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ వినోద్‌కుమార్ కథనం మేరకు...ప్రొద్దుటూరుకు చెందిన ఈమె 24ఏళ్ల క్రితం నాగరాజుతో వివాహమైంది. నాగరాజు ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తూ, స్థానిక సాయిబాబా గుడిలో పూజారిగా ఉండేవాడు. పాఠశాలకు వెళ్లడంతో ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని మృతి చెందింది. స్థానికులు గమనించి తలుపులు పగులగొట్టి తీయగా అప్పటికే మృతి చెందింది. మృతి కారణం సంతానం కలుగలేదని, అనారోగ్యం వల్లే నంటూ బంధువులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. -
నిధులున్నా.. రోడ్లు సున్న
‘గిరి’ గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కరువు ఆటోలు కూడా వెళ్లలేని దుస్థితి ఎడ్లబండ్లపైనే ప్రయాణం అభివృద్ధికి నోచుకోని పల్లెలు కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తుల వేడుకోలు చెన్నూర్ రూరల్:మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఆ గ్రామాలు అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో ఉన్నాయి.ఆ గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యాలు లేక ఇప్పటి వరకు బస్సు కూడా వెళ్లలేని దీన స్థితిలో ఆ గ్రామాలు ఉన్నాయి.మండలంలోని బుద్దారం గ్రామ దుస్థితి ఇది.బుద్దారం గ్రామ పంచాయితీ పరిధిలో కన్నెపల్లి,సం కారం గ్రామాలు ఉన్నాయి.ఈ మూడు గ్రామాల్లో సుమారు 1300 వరకు జనాభా జీవిస్తున్నారు.అయితే బుద్దారం, సంకారం గ్రామాల్లో ఎక్కువ శాతం గిరిజననులే.ఈ గ్రామాలకు వెళ్లాలంటే చుట్టూ దట్టమైన అడవీ,మధ్యమధ్యలోఎ వంతెనలేని వాగులు దర్శనమిస్తాయి. ఇక వర్షాకాలంలో వాగులు ఉప్పొంగితే ఈ గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.ఈ గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో గ్రామాల ప్రజలు వారి అవసరాలకు పట్టణాలకు వెళ్లాలంటే ఇబ్బం దులు పడుతున్నారు.కనీసం ఆటోలు కూడా వెళ్లడానికి కూడా రోడ్డు సదుపాయం లేకపోవడంతో సుంకారం, బుద్దారం గ్రామాల ప్రజలకు ఎడ్లబండ్లే శరణ్యమవుతున్నాయి.ఈ గ్రామాల్లోని ప్రజలకు అత్యవసర పరిస్థితిలో కనీసం అంబులెన్సు కూడా వెళ్లలేని దుస్థితి.గిరి గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బం దులు పడాల్సి వస్తుందని ఈ మూడు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. నిధులు మంజూరైనా.. సంకారం, బుద్దారం గ్రామాల ప్రజల సౌకర్యార్థం తారురోడ్డు నిర్మించడానికి ఎనిమిది నెలల క్రితం రూ.11.15కోట్ల నిధులు మంజూరయ్యూరుు.కానీ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లకు మంజూరైన నిధులు మూలన మూలుగుతున్నాయి.ఏళ్లు గడుస్తున్నా తమ గ్రామాలకు ఇప్పటికీ కనీస రోడ్లు సౌకర్యం లేక బాహ్య ప్రపంచానికి దూరంగా జీవనం సాగించాల్సి వస్తుందని ఆయూ గ్రామాల ప్రజలు వాపోతున్నారు.ప్రభుత్వం వెనకబడిన గ్రామాలను అభివృద్ధి చేసేదెప్పుడని ఆయూ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్లు సరిగా లేవు మా ఊరికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. దీంతో మాకు కాలినడక, ఎడ్లబండ్లే శరణ్యమవుతున్నాయి. కన్నెపల్లి వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడి నంచి ఆటోల్లో ప్రయూణిస్తాం.ఇక వర్షాకాలం వచ్చిందంటే మా గ్రామాలకు ఆటోలు కూడా సరిగా నడవవు. - శ్రీను, బుద్దారం రోడ్లు నిర్మించాలి మా గ్రామానికి వెళ్లాలంటే కాలినడకే గతి. సరైన రోడ్లు లేక మాగ్రామాలకు బస్సులు, ఆటోలు రావు.దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది.ఏళ్లు గడుస్తున్నా మా కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రభుత్వం పట్టించుకొని మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. - అర్జయ్య, సంకారం -
విష జ్వరంతో చిన్నారి మృతి
చెన్నూరు: స్థానిక సరస్వతీనగర్‌లో నివాసముంటున్న కె రవి, మహేశ్వరిల కుమార్తె తేజస్విని(2) విషజ్వరంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. బంధువులు తెలిపిన ప్రకారం తేజస్వినికి మూడు రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాల, ఆర్ఎంపీ వైద్యుని వద్ద చికిత్స చేయించారు. శుక్రవారం వైద్యశాలలో చికిత్స అనంతరం ఇంటికి తీసుకురాగా రాత్రి తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉండటంతో స్థానిక ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లగా, కడపకు తీసుకెళ్లాలని సూచించారు. రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. విజృంభిస్తున్న విష జ్వరాలు : చెన్నూరు మండలంలోని చిన్నమాచుపల్లె, శివాలపల్లె, చెన్నూరు, బయనపల్లె గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. చెన్నూరు తూర్పు దళితవాడకు చెందిన బాలిక డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతోంది. వనంవీధికి చెందిన సురేష్ కుమార్తె అలేఖ్య (7) విషజ్వరంతో బాధపడుతుండగా కడపకు తీసుకెళ్లగా డెంగీ జ్వరమని అక్కడి వైద్యులు నిర్ధారించడంతో కర్నూలుకు తరలించారు. మండలంలో పలు గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతున్నారని అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
చెన్నూరు: విషజ్వరంతో భార్య మృతిచెందడంతో మనస్థాపం చెందిన భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో బుధవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు... చెన్నూరు పుప్పాల హనుమాన్ వీధికి చెందిన స్రవంతి, శ్రీనివాసులుకు ఏడాది క్రితం వివాహం అయింది. విషజ్వరంతో స్రవంతి రెండు రోజుల క్రితం మృతి చెందింది. భార్య ఎడబాటుతో మనస్థాపం చెందిన శ్రీనివాసులు బుధవారం మధ్యాహ్నం మంచిర్యాల వెళ్లి అక్కడ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల వ్యవధిలో దంపతులుద్దరూ మృతిచెందడంతో స్థానికంగా విషాదం అలముకుంది. -
విషజ్వరంతో వ్యక్తి మృతి
చెన్నూరు (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు మండలంలో విషజ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. చెన్నూరు పట్టణంలోని లైన్‌గడ్డ ప్రాంతానికి చెందిన తగరం మల్లేష్(38) అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన గత వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్నాడు. కాగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మండల పరిధిలో విషజ్వరాలు ప్రబలి జనాలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కుక్కర్ లో వేడి చేస్తే మెరుగవుతాయని..
చెన్నూరు(వైఎస్సార్ జిల్లా): నగలకు మెరుగుపెడతామని చెప్పి ఒక మహిళను మోసం చేసి 12 తులాల బంగారు ఆభరణాలతో ఇద్దరు దుండగులు ఉడాయించారు. ఈ సంఘటన సోమవారం వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని రెడ్డి వారి వీధిలో జరిగింది. వివరాలు.. రెడ్డివారివీధికి చెందిన లక్షమ్మ ఇంటికి ఇద్దరు వ్యక్తులు నగలకు మెరుగుపెడతామని వచ్చారు. దీంతో లక్షమ్మ తన వద్ద ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలను వారికి ఇచ్చింది. కాగా, ఈ ఆభరణాలకు రసాయనాలు వేశాం కుక్కర్లో వేడి చేస్తే మెరుగవుతాయని చెప్పి వెళ్లిపోయారు. మహిళ వారు చెప్పినట్లుగానే వేడి చేసి చూడగా కుక్కర్లో నగలు కనిపించకపోవడంతో లభోదిబోమంది. మోసం పోయానని గ్రహించిన లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. -
'రేషన్' కోసం ఆందోళన
చెన్నూరు: వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని మైనారిటీ కాలనీలో రేషన్ సరుకుల కోసం స్థానికులు శనివారం ఆందోళన బాట పట్టారు. సాంకేతిక సమస్యల కారణంగా మే నెలకు సంబంధించి బియ్యం, చక్కెర ఇవ్వడం కుదరదని, గడువు తీరిపోయిందని డీలర్ చెబుతుండడంతో స్థానికులు ధర్నాకు దిగారు. తమకు అన్ని రేషన్ సరుకులను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న ఎమ్మార్వో శాంతమ్మను వారు ముట్టడించారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. -
పింఛన్ ఇయ్యుండ్రి సారూ..
కళ్లు కనిపించవు.. పింఛన్ రాదు! దసరా పండుగ పింఛన్ సంబరాలు తెస్తుందనుకున్న ఆశ అడియాసే అయింది. దీపావళి వెలుగులు పింఛన్ రూపంలో వచ్చేది కలే అయింది. నవంబర్ పోయింది. డిసెంబర్ వచ్చింది. కానీ పింఛన్ జాడ మాత్రం కానరాకుండా పోయింది. పెరిగిన పింఛన్ వస్తదనుకుంటే ఉన్న పింఛన్ ఆగిపోయిందని బాధితులు పడుతున్న ఆందోళన వర్ణణాతీతం. అసలు తమకు పింఛన్ వస్తుందో రాదోనన్న ఆవేదన నిత్యం వారిని కుదిపేస్తుంది. అలాంటి కొందరి దీనగాథలివీ.. చెన్నూర్ రూరల్ : కళ్లు కనబడని భర్తకు అన్ని తానైంది. కూలీ పని చేసుకుంటూ భర్తను, పిల్లలను పోషించుకుంటోంది. వివరాలిలా ఉన్నాయి. చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి జగన్నాథుల పెద్ద కొండయ్యకు చిన్నతనం నుంచే రెండు కళ్లు కనబడవు. అతడి భార్య ఓదమ్మ భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. ఎరుకుల కులానికి చెందిన వీరి ప్రధాన వృత్తి పందుల పెంపకం, బుట్టలు అల్లడం. కానీ కొండయ్యకు కళ్లు కనబడకపోవడంతో వారు ఆ వృత్తికి దూరమయ్యారు. వీరు తలదాచుకునేందుకు సరైన ఇళ్లు కూడా లేదు. గ్రామంలోనే చిన్న పూరిగుడిసె వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొండయ్యకు కళ్లు కనబడక పోవడంతో భార్య ఓదమ్మ అన్ని సపర్యలూ చేస్తోంది. ఓదమ్మ కూలీ పనులకు వెళ్తూ, ఇంటి దగ్గర ఈత కొమ్మలతో బుట్టలు అల్లి భర్త, పిల్లలను పోషించుకుంటోంది. భర్తను ఎటైనా తీసుకు వెళ్లాలంటే ఓదమ్మ తోడు ఉండాల్సిందే. అంధుడైన భర్తను కర్ర సహాయంతో తీసుకెళ్తుంది. ఉన్న ఆసరా పోయింది కొండయ్యకు గతంలో ప్రభుత్వం వికలాంగుల కోటా కింద రూ.500 పింఛను ఇచ్చేది. కానీ ఇప్పుడు ఆ పింఛను కూడా రావడం లేదు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. తాను పనికి వెళ్లని రోజు తన భర్త, పిల్లలు పస్తులుండాల్సిందేనని ఓదమ్మ కన్నీటి పర్యమంతమైంది. ఇక తన భర్తను ఎక్కడకు తీసుకుపోయి వికలాంగుల సర్టిఫికెట్ తెచ్చేదని ఆమె కంట తడి పెట్టింది. తన భర్తకు సర్టిఫికెట్ ఇప్పిస్తే పింఛన్ వస్తుందని, ఇంత ఆసరాగా ఉంటుందని ఆమె వేడుకుంటోంది. ఎవరైనా ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలని కొండయ్య, ఓదమ్మలు కోరుతున్నారు. -
పారాణి ఆరకనే
పారాణింకా ఆరనే లేదు..తోరణాల కళ వాడనే లేదు..పెళ్లి పందిరి తీయనే లేదు.. పెళ్లి కూతురుగా కళకళలాడిన ఓ నవ వధువుకు అప్పుడే నూరేళ్లు నిండాయి. పున్నమి రువ్విన వెన్నెల నవ్వకు అమావాస్య చీకట్లు కమ్మేశాయి. కన్నవారికి గుండెకోత మిగిల్చిన ఈ విషాద సంఘటన చెన్నూరులో ‘శని’వారం చోటు చేసుకుంది. చెన్నూరు : చెన్నూరులోని బ్రాహ్మణవీధికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు పూసపాటి ఉమాదేవి కుమార్తె వినీల(23) వివాహం ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పని చేసే జయకృష్ణతో మే 24న అంగరంగ వైభవంగా జరిగింది. దాంపత్య జీవితంపైన, కాబోయే భర్తపై ఎన్నో ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన వినీల మూడుముళ్లు పడగానే ఎంతో ఇష్టంగా అత్తారింట మహాలక్ష్మిలా అడుగుపెట్టింది. అప్పటి నుంచి వారి దాంపత్య జీవనం అన్యోన్నంగా సాగిపోతోంది. పుట్టింటికని వచ్చి... ఆ నవ వధువుకు ఏం కష్టమొచ్చిందో.. ఏమో గానీ మూడ్రోజుల కిందట పుట్టింటికి వచ్చింది. శనివారం అమ్మ పాఠశాలకు వెళ్లగా.. అమ్మమ్మ, అన్న బయట ఉండగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వినీల బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆ తరువాత ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని వేలాడింది. సకాలంలో ఎవరూ గమనించకపోవడంతో ఆమె ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. ఎంతసేపటికీ వినీల బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అమ్మమ్మ ఎంత పిలిచినా వినీల నుంచి సమాధానం లేదు. దీంతో ఆందోళనతో ఇరుగుపొరుగు వారిని పిలిచి తలుపులు పగులగొట్టి చూడగా అక్కడి దృశ్యం చూసి వారు నిశ్చేష్టులయ్యారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న వినీలను కిందకు దించి చూడగా అప్పటికే ఆమె శ్వాస ఆగిపోయి ఉండడాన్ని గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే అమ్మ, అన్న, బంధువులు ఇంటికి చేరుకున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. వినీలను చూసేందుకు వచ్చిన స్నేహితులు, స్థానికులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. రంగంలోకి దిగిన తహశీల్దార్, ఎస్ఐ వినీల ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే చెన్నూరు తహశీల్దార్ శాంతమ్మ, ఎస్ఐ హనుమంతు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి తల్లి ఉమాదేవి, బంధువులు, ఆమె భర్త జయకృష్ణ, స్థానికులను విచారణ జరిపారు. పెళ్లై రెండు నెలలు కూడా పూర్తి కాలేదని వారు చెప్పారు. అయితే ఆమెకు అప్పుడప్పుడు కడుపునొప్పి వచ్చేదని, వైద్యం కూడా చేయించుకునేదని తెలిపారు. దీనిపై ఎస్ఐ స్పందిస్తూ.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇసుక తవ్వకాలు వాస్తవమే
చెన్నూర్/చెన్నూర్‌రూరల్, న్యూస్‌లైన్: మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు వాస్తవమేనని అధికారులు నిర్వహించిన విచారణలో తేలింది. అక్కెపల్లి, చింతలపల్లిలోని గోదావరి, బతుకమ్మ వాగు పరీవాహక ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో వేసిన ఇసుక మేటలు తొలగించేందుకు అనుమతి పొందిన పట్టాదారులు అక్రమంగా గోదావరి, వాగుల నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని గోదావరి పరిరక్షణ కమిటీ సభ్యుడు రేగళ్ల విజయానంద్ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ దీనిపై విచారణకు ముగ్గురు అధికారులతో త్రిసభ్య కమిటీ వేశారు. ఈ మేరకు గురువారం కమిటీ సభ్యులు భూగర్భజల శాఖ డెప్యూటీ డెరైక్టర్ కుమారస్వామి, ఏడీ ప్రదీప్‌కుమార్, ఆర్ఐ నిరంజన్ ఇసుక క్వారీలపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. పట్టా భూముల్లో వేసిన ఇసుక మేటలు తొలగించేందుకు మాత్రమే పట్టాదారులకు అనుమతి ఉందన్నారు. పట్టాదారులు ఆ అనుమతిని అతిక్రమించి గోదావరి, వాగు నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టారని పేర్కొన్నారు. పట్టా భూముల్లో ప్రస్తుతం ఇసుక లేదన్నారు. చింతలపల్లి ప్రాంతంలో 92, 93, 94 సర్వే నంబర్లలోని భూములను స్థానిక అధికారులు చూపించకపోవడంపై కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నివేదికను క లెక్టర్‌కు సమర్పిస్తామని చెప్పారు. వారి వెంట తహశీల్దార్ విజయ్‌కుమార్, మండల సర్వేయర్ ప్రసాద్, వ్యవసాయాధికారి ప్రేమ్‌కుమార్, గోదావరి పరిరక్షణ కమిటీ సభ్యులు మదాసు మధు, రేవేల్లి మహేశ్, పోగుల పురుషోత్తం, అంజన్న, వెంకటేశ్వర్‌గౌడ్ ఉన్నారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
చెన్నూర్, న్యూస్‌లైన్ : వేమనపల్లి మండలం జిల్లెడ వీఆర్వో భీమయ్య గురు వారం చెన్నూర్ పట్టణంలోని వేమనపల్లి మండల కార్యాల యంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వేమనపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన రైతు జావిద్ ఖాన్ నుంచి రూ.13 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. కరీంనగర్ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం.. జిల్లెడ గ్రామ వీఆర్వో భీమయ్య లిం గాల గ్రామానికి సంబంధించిన భూవ్య వహారాలు చూస్తున్నాడు. ఈ నేప థ్యంలో జావిద్‌ఖాన్ తనకున్న 65 సర్వే నంబర్లో గత 17 గుంటల భూమి, అతని భార్య సాధిక పేరు మీద ఉన్న సర్వే నంబర్ 114లో 2.26 గుంటలు, చెల్లెలు సీమ పేరు మీద సర్వే నంబర్ 114లో 2.25 గుంటలు, బావమర్ది గౌస్‌పాషాకు గల ఎకరం భూమిని పట్టాదారు, పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్ల కోసం రెండు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. పట్టా కోసం తిరుగగా, భీమయ్య లంచం ఇస్తే పనిచేస్తానని తెలిపాడు. ఇందుకోసం రూ.18 వేలు డిమాండ్ చేశాడు. ఇందులో రెండేళ్ల క్రితం రూ.5 వేలు తీసుకున్నాడు. అప్పటి నుంచి జావిద్ తిరుగుతూనే ఉన్నాడు. మిగతా రూ.13 వేలు ఇస్తేనే పాస్‌పుస్తకాలు ఇస్తానని భీమయ్య తెగేసి చెప్పాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రీతం భీమయ్యను జావిద్ కలిశాడు. మిగతా డబ్బులు గురువారం ఇస్తానని చెప్పాడు. వెంటనే ఏసీబీ అధికారులను జావిద్ ఆశ్రయించాడు. అధికారుల పథకం ప్రకారం గురువారం రాత్రి జావిద్‌ఖాన్ భీమయ్యకు రూ.13వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.