వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని మైనారిటీ కాలనీలో రేషన్ సరుకుల కోసం స్థానికులు శనివారం ఆందోళన బాట పట్టారు.
చెన్నూరు: వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని మైనారిటీ కాలనీలో రేషన్ సరుకుల కోసం స్థానికులు శనివారం ఆందోళన బాట పట్టారు. సాంకేతిక సమస్యల కారణంగా మే నెలకు సంబంధించి బియ్యం, చక్కెర ఇవ్వడం కుదరదని, గడువు తీరిపోయిందని డీలర్ చెబుతుండడంతో స్థానికులు ధర్నాకు దిగారు. తమకు అన్ని రేషన్ సరుకులను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న ఎమ్మార్వో శాంతమ్మను వారు ముట్టడించారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు.