
సాక్షి, కడప : ఆప్కో(ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రాథమిక సహకార సంఘం) మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం కడప జిల్లాలోని ఖాజీపేటలో ఆయన నివాసంలో, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. గతంలో ఆప్కోలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతున్నారు. కాగా ఇప్పటికే ప్రొద్దుటూరులో చేనేత సొసైటీలో జరిగిన అక్రమాల పరంపరలో సొసైటీల అకౌంటెంట్లు శ్రీరాములు, కొండయ్య ఇళ్లపై సీఐడీ అధికారుల దాడులు చేశారు. ఈ క్రమంలో అధికారులు వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారు, డాక్యుమెంట్లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. (చేటు తెచ్చిన సివిల్ పంచాయితీ)
Comments
Please login to add a commentAdd a comment