కొత్త డీఈవోగా శ్రీనివాసులురెడ్డి
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖాధికారి దొంతు ఆంజనేయులు శ్రీ పొట్టి శ్రీరాము లు నెల్లూరు జిల్లా కు బదిలీ అయ్యా రు. ఆయన స్థానం లో తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శని వారం ఉత్తర్వులు విడుదల చేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల డీఈవోల బదిలీల్లో భాగంగా దొంతు ఆంజనేయులుకు స్థాన చలనం కలిగింది. నెల్లూరులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్‌ఈ) సంస్థ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ 2012 ఏప్రిల్ 9న గుంటూరు డీఈవోగా వచ్చిన ఆంజనేయులు తిరిగి అదే జిల్లాకు డీఈవోగా వెళుతున్నారు.