తాడిపత్రి రూరల్ : తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డులో ఆదివారం ద్విచక్రవాహనం కరెంటు స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన పెయింటర్ శ్రీనివాసులు(35) మృతి చెందగా అనంతపురానికి చెందిన మురళి(25) తీవ్రంగా గాయపడ్డాడు. రూరల్ పోలీసులు సంఘటన స్థలం చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మురళిని అనంతపురం ఆస్పత్రికి పంపించారు. మృతుని తండ్రి నాగన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతునికి భార్య ఉంది. పిల్లలు లేరు.