
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అనంతరం, తాడిపత్రి నియోజకవర్గంలోకి కేతిరెడ్డి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
తాడిపత్రిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం ఉదమయే కేతిరెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని గృహ నిర్బంధంలోనే ఉంచారు. అనంతరం, కేతిరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ వర్గీయులు రెచ్చిపోతున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఏడు నెలలుగా అడ్డంకులు సృష్టిస్తూన ఉన్నారు. జేసీ కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ, పోలీసుల తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం తాడిపత్రిలోకి ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ ప్రశ్నించారు. దీంతో, తిమ్మంపల్లి గ్రామంలో పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment