సోదరుని అంత్యక్రియల్లో హాజరయ్యేందుకు వచ్చిన ఓ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం అమ్మవారిపల్లెలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురుకుండి శ్రీనివాసులు హత్యకేసులో నెల్లూరు జైలులో జీవిత ఖై దు అనుభవిస్తున్నాడు.
అయితే, అతని సోదరుడు చిన్నవెంకటేశ్వర్లు సోమవారం చనిపోయాడు. మంగళవారం జరిగే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెరోల్‌పై అతడిని పోలీసులు అమ్మవారిపల్లెకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు ఏమరుపాటులో ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న శ్రీనివాసులు పరారయ్యాడు. అతని కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు.