తిరుమల: తిరుమలలో సంప్రదాయాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించి.. తీరా తమకు తోచిన వారికి అత్యధిక టికెట్లు కేటాయించేలా టీటీడీపై ఒత్తిడి తెస్తోంది. సాధారణంగా టీటీడీ నియమావళి ప్రకారం రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నవారు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు స్వయంగా దర్శనానికి వస్తే, వారితో పాటు వచ్చేవారికి కూడా ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేస్తారు. వారు స్వయంగా రాకుండా కుటుంబ సభ్యులు వస్తే రెఫరల్ ప్రొటోకాల్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
అయితే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దర్శనానికి స్వయంగా రాకపోయినప్పటికీ, ఆయన అన్న కుమారుడు శివకుమార్‌తో పాటు మరో 14 మందికి ప్రొటోకాల్ బ్రేక్ దర్శనాలు కేటాయించారన్న వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంత షాడో ఎమ్మెల్యే అయినా 14 బ్రేక్ దర్శనాలు ఎలా ఇస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై టీటీడీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment