ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు కరంచంద్ ఆద్వర్యంలో చెంచికపల్లి, ఎరంపల్లి, పరుగుపల్లి, లోడుపల్లె, కొండపల్లి, మర్తిడి గ్రామాల్లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 6,800 లీటర్ల బెల్లం ఊట, 1,800 లీటర్ల గుడుంబా నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎవరినీ అరెస్టు చేయలేదు. కాగా.. స్వాధీనం చేసుకున్న బెల్లం ఊట, గుడుంబా నిల్వలను ధ్వంసం చేశారు.
నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు
Published Fri, Feb 12 2016 10:32 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement