ఆదిలాబాద్: వేమనపల్లి మండలంలోని మారుమూల బుయ్యారం గ్రామంలో మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 600 లీటర్ల బెల్లంపానకం డ్రమ్ములు, 20 లీటర్ల గుడుంబాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపుతున్నా గ్రామంలో గుడుంబా తయారీ తగ్గడం లేదు. ఈ విషయంలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు రంగంలోకి దిగారు. మంచిర్యాల అసిస్టెంట్ సూపరింటెండెంట్ కరమ్‌చంద్ నేతృత్వంలో ఎక్సైజ్ సిబ్బంది మూడు బృందాలుగా మంగళవారం గ్రామంలో దాడులు నిర్వహించారు. ఇళ్లలో సోదాలు చేసినా ఏమీ లభ్యం కాలేదు. గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని మల్లన్న గుడి, పాలసముద్రం చెట్ల మధ్య గుడుంబా, బెల్లంపానకం పట్టుకున్నారు. వీటిని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. బుయ్యారం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులే రహస్య స్థావరాల్లో గుడుంబా కాస్తున్నారు. ఈ విషయమై పూర్తి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. దాడుల్లో ఆదిలాబాద్ ఎక్సైజ్ సీఐ సుంకరి రమేశ్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూర్ ఎక్సైజ్ ఎస్సైలు ముత్యం, బేగ్, దిలీప్, కిషన్ సిబ్బంది పాల్గొన్నారు.
గుడుంబా స్థావరాలపై దాడులు
Published Wed, May 18 2016 10:04 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement