ఓర్వకల్లు, న్యూస్‌లైన్: బతుకుదెరువుకోసం వచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఓర్వకల్లు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. 45 రోజుల క్రితం కర్నూలు జిల్లాకు వచ్చిన మధ్యప్రదేశ్‌లో ని డ్యాతోల్ జిల్లా, బాషపాణ గ్రామానికి చెందిన జితేంద్ర(45) నెల రోజులుగా ఉలిందకొండ వద్ద జరుగుతున్న విద్యుత్ టవర్ల నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఎల్‌ఎంటీ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుత్ టవర్ల వద్ద కాపలా ఉండేందుకు కాం ట్రాక్టర్ శ్రీనివాసులు జితేంద్రను ఓర్వకల్లు వద్దకు తీసుకొచ్చాడు.
అతనితో పాటు మరో ఐదుగురు అక్కడే పని చేస్తున్నారు. ఈ క్రమం లో రెండు రోజుల క్రితం వారి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి జితేంద్ర హత్యకు గురి కావడం అనుమానాలకు తావిస్తోంది. తాలుకా రూరల్ సీఐ శ్రీనివాసమూర్తి, ఉలిందకొండ ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌రెడ్డి, క్లూజ్ టీమ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడే పని చేస్తున్న నలుగురిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.
మధ్యప్రదేశ్ వాసి హత్య
Published Tue, Jan 14 2014 1:04 AM | Last Updated on Mon, Oct 8 2018 3:28 PM
Advertisement
Advertisement