కంభం(ప్రకాశం): ప్రకాశం జిల్లా కంభం వాల్మీకి నగర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మాజీ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్, కాంట్రాక్టర్ కటకం శ్రీనివాసులును ఆయన ప్రత్యర్థులు వేట కొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు.
శుక్రవారం రాత్రి పూర్ణిమా రెస్టారెంట్‌లో స్నేహితులతో కలసి పార్టీ చేసుకొని ఆనందరావుతో కలిసి స్కూటీ మీద వెళ్తుండగా.. మార్గమధ్యలో మాటువేసిన కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆనందరావుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మాటువేసి వేట కొడవళ్లతో దాడి
Published Sat, Mar 25 2017 9:29 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
Advertisement
Advertisement