మహానందిలో వైభవంగా రథోత్సవం
కర్నూలు : కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రం శివ నామ స్మరణతో పులకించింది. గురువారం మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎటువంటి అపశ్రుతులు దొర్లకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నారు.
(మహానంది)