కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వీరభద్రస్వామి ఆలయంలో చోరీ జరిగింది.
కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వీరభద్రస్వామి ఆలయంలో చోరీ జరిగింది. వీరభద్రస్వామి విగ్రహంపై ఉన్న బంగారు, వెండి నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 3 కేజీల వెండి, 12 గ్రాముల బంగారు నగలను ఎత్తుకెళ్లినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్ తెప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.