కర్నూలు: పరిశ్రమల ఏర్పాటు పేరుతో సాగు భూములను, నివాస ప్రాంతాలను ప్రభుత్వం ఆక్రమించుకుంటోందని ఆరోపిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఓర్వకల్లు తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ఉదయం ధర్నా చేపట్టారు. తమ నివాసాలను, అన్నం పెట్టే భూములను మాత్రం సేకరణ నుంచి విడిచి పెట్టాలన్నారు.
కాగా,మండలంలోని సోమయాజుల పల్లి, కొమరోలు, చిన్నంశెట్టిపల్లె తదితర గ్రామాల్లో పరిశ్రమలు ఏర్పాటుకానున్న నేపథ్యంలో అధికారులు ఇటీవల భూ సర్వేలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో న్యూక్లియర్ ఫ్యూయల్ కార్పొరేషన్, సోలార్ ప్రాజెక్టు, డీఆర్డీవో తదితర సంస్థల ఏర్పాటుకు యత్నాలు సాగుతున్నాయి. వీటిపై సంబంధిత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.