ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ తెరపైకి..! | Special Story On Adoni TDP Leader Meenakshi Naidu In Telugu, Details Inside - Sakshi
Sakshi News home page

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ తెరపైకి..!

Published Sun, Feb 11 2024 4:46 PM | Last Updated on Sun, Feb 11 2024 5:57 PM

Special Story On Adoni TDP Leadesr Meenakshi Naidu - Sakshi

కొందరు నాయకులు వర్షా కాలంలో వచ్చే కప్పల్లా ఉంటారు. వర్షం పడిన వెంటనే కుప్పలుగా కప్పలు వస్తారు. బెకబెకమంటారు. అలాగే ప్రతిపక్షంలోని కొందరు నేతలు ఎన్నికలు వస్తున్నాయనగానే మేము వచ్చేశాం అంటారు. మీటింగ్‌లతో హల్ హల్ చేస్తుంటారు. ఓడిపోగానే మాయమైపోయి...ఎన్నికలు రాగానే ప్రత్యక్షమయ్యే వీరిని చూసి ప్రజల్లో ఉండే నాయకులకు మండుకొస్తుంది. ఇప్పుడు కర్నూల్ జిల్లాలో ఓ టీడీపీ నేత అలాగే ప్రత్యక్షం కావడంతో అక్కడి పార్టీ నేతలు ఖంగు తిన్నారు. ఇన్నాళ్ళు ఏమయ్యారంటూ నిలదీస్తున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? 

కర్నూలు జిల్లాలో ఆదోని రాజకీయాలే వేరులే అన్నట్లుగా సాగుతున్నాయి. 2014, 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఈ నియోజక వర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున ఎల్లారెడ్డి సాయిప్రసాద్ రెడ్డి  ఎమ్మెల్యేగా గెలుపొందారు . అంతకు ముందు  టీడీపీ నేత మీనాక్షి నాయుడు కూడా రెండు సార్లు ఆదోని ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీ తరపున బరిలోకి దిగిన మీనాక్షినాయుడిని మూడుసార్లు  ఓడించారు సాయిప్రసాద్ రెడ్డి. 

2019   ఎన్నికల్లో  ఓటమి పాలైన తరువాత రాజకీయాల్లో  మీనాక్షినాయుడి ఉనికి లేకుండా పోయింది.  నియోజక వర్గంలో పార్టీ కార్యక్రమాలకు  దూరంగా ఉన్నారు . క్యాడర్ కూడా మిన్నుకుండిపోయారు . ఎవరి దారి వారిదన్నట్లుగా కార్యకర్తలు చెల్లా చెదురయ్యారు. కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందిస్తుండడంతో టీడీపీకి చెందిన చాలా మంది వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దాంతో ఆదోని నియోజక వర్గంలో ఎల్లో పార్టీ జాడలు దాదాపు లేకుండా పోయాయి. 

ఎన్నికలలు సమీపిస్తున్న వేళ మళ్లీ తెరపైకి వచ్చాడు మీనాక్షి నాయుడు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రెస్ మీట్లతో హడావుడి చేస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టని నేతగా పేరు పొందిన ఆయన ...ఈ సారి టికెట్ కోసం హల్ చల్ చేయడంపై సొంతపార్టీ నేతలే కస్సుబస్సుమంటున్నారు .

ఇన్నాళ్లు నియోజక వర్గంవైపు  కన్నెత్తిచూడని మీనాక్షినాయుడు .. ఇప్పుడొచ్చి టికెట్ కోసం గంతులేయడమేంటని ఈసడించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మీనాక్షికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని,నేరుగా చంద్రబాబుకే  తెగేసి చెబుతున్నారట. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా మీనాక్షినాయుడికి వ్యతిరేకంగా వ్యవహరించిన గుడిసెల కృష్ణమ్మ , మైనార్టీ నేత సౌదీ రవూఫ్  నారాలోకేష్ తో సపరేటుగా మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. దాంతోటీడీపీ నేతలు రెండువర్గాలుగా చీలిపోయి తెరవెనుక  పావులు కదుపుతున్నారు . 

మీనాక్షినాయుడికి చెక్ పెట్టడానికి బీసీ , మైనార్టీ నేతలు గట్టిగనే ఉన్నట్లు తెలుస్తుంది.  ఇది ఇలా ఉంటే  కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీనాక్షి నాయుడికి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందా ?  లేదా బిసిల వైపు చంద్రబాబు మెగ్గుచూపుతారా ?అన్న అంశం తేలాల్సి వుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement