Adoni Assembly Constituency
-
‘‘నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం’’
కర్నూలు, సాక్షి: కూటమి ప్రభుత్వంలో ఉండడం ఏమోగానీ.. అధికార మదంతో రోజుకొకరు వార్తల్లో నిలుస్తున్నారు. తాము ఏం చెబితే అదే శాసనం అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆ తరహా దురుసు వ్యాఖ్యలే చేశారు.కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం. నేను చెబితే చంద్రబాబు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కల్యాణ్ చెప్పినట్లే. ఎవరైతే ఇన్నాళ్లూ.. ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు కొనసాగిస్తున్నారో వాళ్లంతా ఉన్నపళంగా వదలేసి వెళ్లిపోవాలి. .. అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తేవడాల్లాంటివి ఉండవు. వాళ్లంతా లబ్ధి చేకూర్చేవన్నింటిని విడిచిపోవాలి. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. లేకుంటే లెక్క మరోలా ఉంటుంది’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఆయన వర్గీయులు రెచ్చిపోయారు. ఐదు రేషన్ షాపులకు తాళాలు వేసి.. ‘ఇక నుంచి ఇవి మావే’ అంటూ ప్రకటన చేశారు. దీంతో రేషన్ డీలర్లు షాక్‌కు గురయ్యారు.‘‘ఎన్టీఆర్ హయాం నుంచి ఆ రేషన్ షాపులను తామే నడుపుకుంటున్నామని, ఇప్పుడు ఉన్నపళంగా లాగేసుకోవడం ఏంటని, తమ షాపులు లాకుంటే తాము రోడ్డున పడుతామంటూ’’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహం భావంతో ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
టీడీపీ-బీజేపీ: పురందేశ్వరి పేరిట ‘టికెట్’ బేరసారాలు
సాక్షి, కర్నూలు: ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ-బీజేపీ బేరసారాల ఆడియో కలకలం రేపుతోంది. రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి బీజేపీ నేతలు ఆఫర్ ఇచ్చారు. సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతలు ప్రతిపాదించారు. పురందేశ్వరి ఆదేశాలతోనే బేరసారాలు జరిగినట్లు బీజేపీలో చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు నాగరాజు (ఇతను కూడా బీజేపీ నాయకుడు)కు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. పురందరేశ్వరి మూడు కోట్ల రూపాయలు డబ్బులు అడిగారని, ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరుకి మారుస్తామని బేరం పెట్టిన ఆడియో సంచలనం రేపుతోంది. పురందేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న సందర్భంలో ఈ ఆడియో సాక్ష్యాలతో దొరకడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదీ చదవండి: చంద్రబాబు, పురందేశ్వరి స్కెచ్.. ‘కళా’ కుటుంబంలో కుంపటి -
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ తెరపైకి..!
కొందరు నాయకులు వర్షా కాలంలో వచ్చే కప్పల్లా ఉంటారు. వర్షం పడిన వెంటనే కుప్పలుగా కప్పలు వస్తారు. బెకబెకమంటారు. అలాగే ప్రతిపక్షంలోని కొందరు నేతలు ఎన్నికలు వస్తున్నాయనగానే మేము వచ్చేశాం అంటారు. మీటింగ్‌లతో హల్ హల్ చేస్తుంటారు. ఓడిపోగానే మాయమైపోయి...ఎన్నికలు రాగానే ప్రత్యక్షమయ్యే వీరిని చూసి ప్రజల్లో ఉండే నాయకులకు మండుకొస్తుంది. ఇప్పుడు కర్నూల్ జిల్లాలో ఓ టీడీపీ నేత అలాగే ప్రత్యక్షం కావడంతో అక్కడి పార్టీ నేతలు ఖంగు తిన్నారు. ఇన్నాళ్ళు ఏమయ్యారంటూ నిలదీస్తున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? కర్నూలు జిల్లాలో ఆదోని రాజకీయాలే వేరులే అన్నట్లుగా సాగుతున్నాయి. 2014, 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఈ నియోజక వర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున ఎల్లారెడ్డి సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు . అంతకు ముందు టీడీపీ నేత మీనాక్షి నాయుడు కూడా రెండు సార్లు ఆదోని ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీ తరపున బరిలోకి దిగిన మీనాక్షినాయుడిని మూడుసార్లు ఓడించారు సాయిప్రసాద్ రెడ్డి. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత రాజకీయాల్లో మీనాక్షినాయుడి ఉనికి లేకుండా పోయింది. నియోజక వర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు . క్యాడర్ కూడా మిన్నుకుండిపోయారు . ఎవరి దారి వారిదన్నట్లుగా కార్యకర్తలు చెల్లా చెదురయ్యారు. కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందిస్తుండడంతో టీడీపీకి చెందిన చాలా మంది వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దాంతో ఆదోని నియోజక వర్గంలో ఎల్లో పార్టీ జాడలు దాదాపు లేకుండా పోయాయి. ఎన్నికలలు సమీపిస్తున్న వేళ మళ్లీ తెరపైకి వచ్చాడు మీనాక్షి నాయుడు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రెస్ మీట్లతో హడావుడి చేస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టని నేతగా పేరు పొందిన ఆయన ...ఈ సారి టికెట్ కోసం హల్ చల్ చేయడంపై సొంతపార్టీ నేతలే కస్సుబస్సుమంటున్నారు . ఇన్నాళ్లు నియోజక వర్గంవైపు కన్నెత్తిచూడని మీనాక్షినాయుడు .. ఇప్పుడొచ్చి టికెట్ కోసం గంతులేయడమేంటని ఈసడించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మీనాక్షికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని,నేరుగా చంద్రబాబుకే తెగేసి చెబుతున్నారట. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా మీనాక్షినాయుడికి వ్యతిరేకంగా వ్యవహరించిన గుడిసెల కృష్ణమ్మ , మైనార్టీ నేత సౌదీ రవూఫ్ నారాలోకేష్ తో సపరేటుగా మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. దాంతోటీడీపీ నేతలు రెండువర్గాలుగా చీలిపోయి తెరవెనుక పావులు కదుపుతున్నారు . మీనాక్షినాయుడికి చెక్ పెట్టడానికి బీసీ , మైనార్టీ నేతలు గట్టిగనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీనాక్షి నాయుడికి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందా ? లేదా బిసిల వైపు చంద్రబాబు మెగ్గుచూపుతారా ?అన్న అంశం తేలాల్సి వుంది.