టీడీపీ-బీజేపీ: పురందేశ్వరి పేరిట ‘టికెట్‌’ బేరసారాలు | Audio Tape Of TDP And BJP Bargaining On Adoni Assembly Seat | Sakshi
Sakshi News home page

టీడీపీ-బీజేపీ: పురందేశ్వరి పేరిట ‘టికెట్‌’ బేరసారాలు

Published Tue, Mar 26 2024 12:53 PM | Last Updated on Tue, Mar 26 2024 1:38 PM

Audio Of Tdp And Bjp Bargaining On Adoni Assembly Seat - Sakshi

సాక్షి, కర్నూలు: ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ-బీజేపీ బేరసారాల ఆడియో కలకలం రేపుతోంది. రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి బీజేపీ నేతలు ఆఫర్ ఇచ్చారు. సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతలు ప్రతిపాదించారు. పురందేశ్వరి ఆదేశాలతోనే బేరసారాలు జరిగినట్లు బీజేపీలో చర్చ జరుగుతోంది.

కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు నాగరాజు (ఇతను కూడా బీజేపీ నాయకుడు)కు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. పురందరేశ్వరి మూడు కోట్ల రూపాయలు డబ్బులు అడిగారని, ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరుకి మారుస్తామని బేరం పెట్టిన ఆడియో సంచలనం రేపుతోంది.

పురందేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న సందర్భంలో ఈ ఆడియో సాక్ష్యాలతో దొరకడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇదీ చదవండి: చంద్రబాబు, పురందేశ్వరి స్కెచ్‌.. ‘కళా’ కుటుంబంలో కుంపటి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement