ఆగి ఉన్నఆటోను టిప్పర్ ఢీకొనడంతో 8 మందికి గాయాలయ్యాయి.
కర్నూలు: ఆగి ఉన్నఆటోను టిప్పర్ ఢీకొనడంతో 8 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం వద్ద మంగళవారం జరిగింది. ఆథోని నుంచి ఎమ్మిగనూరు వస్తున్న ఆటో చెన్నాపురం క్రాస్‌రోడ్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆగింది. ఆ సమయంలో ఆటోను వెనక వైపు నంచి వేగంగా వచ్చిన టిప్పర్ డీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. స్తానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(ఎమ్మిగనూరు)