భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కుమార్తెలు
శ్రీశైలంప్రాజెక్ట్: కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నాడని 15 సంవత్సరాలుగా బాంధవ్యాలను తెంపుకున్నాడు ఓ తండ్రి. చివరకు కుమారుడి మృతదేహాన్ని కూడా చూడడానికి తల్లిదండ్రులు నిరాకరించి ఇంటికి తాళం వేసి వెళ్లారు. వివరాలు.. సున్నిపెంటలో వ్యాపారం చేసుకుంటున్న మాలపాటి బసిరెడ్డికి నలుగురు సంతానం. రెండో కుమారుడైన రామకృష్ణారెడ్డి 15 ఏళ్ల క్రితం దళిత కులానికి చెందిన బెజవాడ వీరమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అది సహించలేని తండ్రి కుమారునితో తెగదెంపులు చేసుకున్నాడు. కృష్ణారెడ్డి ప్రైవేట్ జీప్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
గత శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా పుచ్చకాయల పల్లికి సమీపంలో జీపులో వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి్పంచగా కోలుకోలేక శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తారని భావించిన తల్లిదండ్రులు శనివారం ఉదయం నుంచే ఇంటికి తాళాలు వేసి ఎటో వెళ్లిపోయారు. కృష్ణారెడ్డి మృతదేహాన్ని భార్య వీరమ్మ, కుమార్తెలు మానస, కవిత.. తన తాత బసిరెడ్డి ఇంటికి తీసుకురాగా తాళాలు వేసి ఉండడంతో ఇంటి ముందే కొద్ది సేపు మృతదేహాన్ని ఉంచి అంత్యక్రియలకు తరలించారు. ప్రైవేట్ జీప్ ఓనర్లు, డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణారెడ్డి కుటుంబానికి వారు రూ.15 వేల ఆరి్ధక సహాయాన్ని అందించారు.
చదవండి: అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది
బాలిక కిడ్నాప్ కేసు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
Comments
Please login to add a commentAdd a comment