రోడ్డు దాటుతున్న ఓ విద్యార్థిని ని టిప్పర్ ఢీకొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
కర్నూలు: రోడ్డు దాటుతున్న ఓ విద్యార్థినిని టిప్పర్ ఢీకొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మినగూరు మండల కేంద్రంలోని హెచ్‌ఎంటీ కాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే సెబీనా బీ పదో తరగతి చదువుతోంది. అయితే ఆమె స్కూలు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో సెబీనాకు తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(ఎమ్మినగూరు)