కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల యుద్ధం రక్తసిక్తమైంది. ఊహించినట్టుగానే చాలా మంది గాయపడ్డారు. కొంతమంది తలలు పగిలాయి. ప్రసిద్ధ మాల మల్లేశ్వరస్వామి సమక్షాన ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి మూలవిరాట్‌ను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. మేమేంటే మేమంటూ ఒకరిపై మరొకరు కర్రలతో కలబడ్డారు. భారీగా పోలీసుల్ని మోహరించినా.. ప్రేక్షతపాత్రకే పరిమితం కావల్సి వచ్చింది. శనివారం తెల్లవారే వరకూ ఈ కర్రల యుద్ధం కొనసాగింది. పది గ్రామాల ప్రజలు బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్ కోసం ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్తో పాటు భాష్పవాయువు ఉపయోగించారు. కర్నూలు జిల్లా హొలగుంద మండలం దేవరగట్టు కొండల్లో వెలసిన మాలమల్లేశ్వర స్వామి వేడుకలు 'బన్సీ ఉత్సవాల' పేరుతో ఏటా విజయదశమిశి నాడు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని సొంత చేసుకునేందుకు పది గ్రామాల ప్రజలు పోటీపడతారు. స్వామి ఎక్కడుంటే అక్కడ పాడిపంటలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారనే అక్కడి భక్తుల విశ్వాసం. అందుకే స్వామిని సొంతం చేసుకునేందుకు అర్థరాత్రి సమయంలో 10 గ్రామాల ప్రజలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకుంటారు.
Published Sat, Oct 4 2014 9:06 AM | Last Updated on Fri, Mar 22 2024 11:12 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement