Banny utsavam
-
దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు
-
కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం
-
భక్తి పేరుతో రక్తం కళ్ల చూశారు...
కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం పదేళ్ల బాలుడిని బలి తీసుకుంది. ఈ ఏడాది పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దేవరగట్టులో ఉద్రిక్తత ఆగలేదు. సమయానికి గ్రామస్థుల చేతుల్లోకి మాత్రం కర్రలు వచ్చేశాయి. దాంతో పాటే వారిలో ఊపు వచ్చింది. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ.. కర్రలు పట్టుకుని కొందరు.. కాగడాలతో మరికొందరు పరుగులు పెట్టారు. అంతా గందరగోళం. ఏం జరుగుతుందో అయోమయం. కర్రలు దూసుకున్నారు.. తలలు పగిలాయి. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా, 60మందికిపైగా గాయపడ్డారు. అధికారులు మాత్రం నలభై మంది గాయపడినట్లు చెబుతున్నారు. కాగా బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఆ ప్రాంత ప్రజలు మాత్రం ఏం జరిగినా వందల ఏళ్ల నుంచి వచ్చే సాంప్రదాయాలు కొనసాగిస్తామని చెబుతున్నారు. -
రక్తచరిత్ర మరోసారి పునరావృతం
-
రక్తచరిత్ర మరోసారి పునరావృతం
కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల యుద్ధం రక్తసిక్తమైంది. ఊహించినట్టుగానే చాలా మంది గాయపడ్డారు. కొంతమంది తలలు పగిలాయి. ప్రసిద్ధ మాల మల్లేశ్వరస్వామి సమక్షాన ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి మూలవిరాట్‌ను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. మేమేంటే మేమంటూ ఒకరిపై మరొకరు కర్రలతో కలబడ్డారు. భారీగా పోలీసుల్ని మోహరించినా.. ప్రేక్షతపాత్రకే పరిమితం కావల్సి వచ్చింది. శనివారం తెల్లవారే వరకూ ఈ కర్రల యుద్ధం కొనసాగింది. పది గ్రామాల ప్రజలు బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్ కోసం ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్‌తో పాటు భాష్పవాయువు ఉపయోగించారు. కర్నూలు జిల్లా హొలగుంద మండలం దేవరగట్టు కొండల్లో వెలసిన మాలమల్లేశ్వర స్వామి వేడుకలు 'బన్సీ ఉత్సవాల' పేరుతో ఏటా విజయదశమిశి నాడు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని సొంత చేసుకునేందుకు పది గ్రామాల ప్రజలు పోటీపడతారు. స్వామి ఎక్కడుంటే అక్కడ పాడిపంటలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారనే అక్కడి భక్తుల విశ్వాసం. అందుకే స్వామిని సొంతం చేసుకునేందుకు అర్థరాత్రి సమయంలో 10 గ్రామాల ప్రజలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకుంటారు.