కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం పదేళ్ల బాలుడిని బలి తీసుకుంది. ఈ ఏడాది పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దేవరగట్టులో ఉద్రిక్తత ఆగలేదు. సమయానికి గ్రామస్థుల చేతుల్లోకి మాత్రం కర్రలు వచ్చేశాయి. దాంతో పాటే వారిలో ఊపు వచ్చింది. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ.. కర్రలు పట్టుకుని కొందరు.. కాగడాలతో మరికొందరు పరుగులు పెట్టారు.
అంతా గందరగోళం. ఏం జరుగుతుందో అయోమయం. కర్రలు దూసుకున్నారు.. తలలు పగిలాయి. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా, 60మందికిపైగా గాయపడ్డారు. అధికారులు మాత్రం నలభై మంది గాయపడినట్లు చెబుతున్నారు. కాగా బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఆ ప్రాంత ప్రజలు మాత్రం ఏం జరిగినా వందల ఏళ్ల నుంచి వచ్చే సాంప్రదాయాలు కొనసాగిస్తామని చెబుతున్నారు.
భక్తి పేరుతో రక్తం కళ్ల చూశారు...
Published Sat, Oct 4 2014 10:12 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement
Advertisement