కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల ఉత్సవానికి అంతా సిద్ధమైంది. దేవరగట్టులో కొలువై ఉన్న మాలమల్లేశ్వరుడి కళ్యాణోత్సవం అనంతరం గ్రామస్థులు అంతా ఒకచోటకు చేరుకుని కర్రలతో కొట్టుకుంటారు. ఈ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
అయితే భక్తులు మాత్రం ఈ బన్నీ ఉత్సవాన్ని చాలా సంబరంగా చేసుకుంటామని, ఇది ఒక ఉత్సవం మాత్రమే తప్ప ఎలాంటి ఆవేశ కావేషాలకు ఇందులో తావిచ్చేది లేదని అంటున్నారు. ప్రతియేటా జరిగే ఈ ఉత్సవంలో తమకు ఎవరికీ ప్రమాదకరమైన గాయాలు మాత్రం కావట్లేదని వాదిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం రక్తపాతం జరగడం సరికాదని, అందుకే తాము 144 సెక్షన్ విధించామని చెబుతున్నారు.
దేవరగట్టులో కర్రల సమరానికి రె'ఢీ'
Published Fri, Oct 3 2014 7:26 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement