bunny festival
-
దేవరగట్టు కర్రల సమరంలో విషాదం
-
దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో పగిలిన తలలు
-
దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఉద్రిక్తత.. ఒకరు మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఒకరు మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు స్థానికులు చెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తూ చెట్టు కొమ్మ విరిగిపడి గణేష్ అనే యువకుడు మృతిచెందాడు. గాయాలపాలైన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దేవరగట్టులో ప్రతీ ఏడాది దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం కర్రల యుద్ధంగా జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ బన్ని ఉత్సవాన్ని మంగళవారం అర్ధరాత్రి కొనసాగించారు. ఈ నేపథ్యంలో దేవరగట్టులో మరోసారి సంప్రదాయమే గెలిచింది. ఆచారం పేరిట యథావిధి ఈ భక్తి పోరాటం కొనసాగింది. ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంతో.. ఉత్సవంలో పాల్గొంటారు. ప్రతీ ఏడాది జరుగుతున్న ఈ సమరంలో అనేక మందికి గాయాలయ్యి, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇదివరకూ అనేకసార్లు జరిగింది. మా ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తాం.. మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదన్న భక్తులు.. ఈ కర్రల సమరంలో సుమారు 2 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం (ఫొటోలు)
-
దేవరగట్టు: భారీ వర్షంలో బన్నీ ఉత్సవం.. 50 మందికిపైగా గాయాలు!
సాక్షి, కర్నూలు: జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో పోలీసుల భద్రత నడుమ బన్నీ ఉత్సవం జరిగింది. భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా పది గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ.. సుమారు రెండు లక్షల మంది జనం బన్నీ తిలకించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆనవాయితీగా ఉత్సవ విగ్రహం కోసం కర్రలతో సమరానికి దిగారు. ఈసారి బన్నీ ఉత్సవంలో 50 మందికిపైగా (సుమారు 80 మందికి) గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. జోరుగా వాన పడుతున్నా లెక్క చేయకుండా వర్షంలోనే బన్నీ ఉత్సవాన్ని తిలకించారు జనాలు. మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేవరగట్టులో 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. దసరా రోజున ప్రతి ఏటా శ్రీమాళ మల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకలలో భాగంగా ఈ కర్రల సమరం నిర్వహిస్తున్నారు. ఉత్సవ వివరాలు ► 5న బుధవారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం ► బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జైత్రయాత్ర మొదలు ► 6వ తేదీ ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి వినిపిస్తారు ► 7వ తేదీ నెరణికి గ్రామ పురోహితులు స్వామి వారికి అర్చనలు చేస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. ► 8న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన ఉంటాయి. ► 9న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇదీ చదవండి: దేవరగట్టుకు భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే...! -
సమరానికి సిద్ధం ... కర్నూల్ జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం
-
దేవరగట్టు.. భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే...!
హొళగుంద: రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్న దసరా బన్ని ఉత్సవానికి దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి పండుగను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం జైత్రయాత్ర కొనసాగనుంది. భక్తులు డిర్ర్..ర్ర్... గోపరక్... బహుపరాక్ అంటూ కర్రల సమరం నిర్వహించనున్నారు. వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రా ష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. ఉత్సవం జరుగుతుందిలా.. దేవరగట్టు పరిసర గ్రామాలు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి వర్గ వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా గ్రామపెద్దలు పోలీసులకు బండారాన్ని ఇస్తారు. అనంతరం బాణసంచా పేల్చి కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టుకొని మేళతాళాలతో కాడప్ప మఠానికి చేరుకుంటారు. అక్కడున్న మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో మాతమాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవం జరిపిస్తారు. అనంతరం జెత్రయాత్ర కొనసాగుతుంది. మొగలాయిలో భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి, పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి చాలా మంది గాయపడ్తారు. గాయపడినవారికి స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. రక్త సంతర్పణ ఉత్సవ విగ్రహాలు రక్షపడికి చేరుకున్నాక.. అక్కడున్న రెండు రాతి గుండ్లకు కంచాభీరా వంశానికి చెందిన గొరువయ్య ఐదు చుక్కల రక్తాన్ని సమర్పిస్తాడు. కాలిపిక్కలో దబ్బణంతో ఒకవైపు నుంచి మరోవైపు లాగడంతో వచ్చే రక్తాన్ని రాతి గుండులకు విసురుతారు. ఉదయంలోపు అక్కడ రక్తపు మరకలు ఉండవని రాక్షసులు సేవిస్తారని భక్తుల నమ్మకం. భవిష్యవాణి శమీ వృక్షం నుంచి విగ్రహాలు బసవన్న గుడికి చేరుకోవడంతో పూజారి, ఆలయ ప్రధాన అర్చకుడు గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. ఆ సమయంలో అందరు ఒక్కసారిగా మొగలాయిని(కర్రలతో కొట్టుకోవడం) నిలిపి వేసి నిశ్శబ్దాన్ని పాటిస్తారు. రాబోయే కాలంలో వాణిజ్య పంటల ధరలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ స్థితులు తదితర పరిస్థితులను పూజారి వివరిస్తారు. అనంతరం పూజారి బహుపరాక్... గోపరాక్ అనగానే విగ్రహాలు సింహాసన కట్ట వైపు ఊరేగింపుగా బయలుదేరుతాయి. ఆ సమయంలో భక్తుల మధ్య జరిగే ఊరేగింపు మరింత భయంకరంగా ఉంటుంది. అప్పుడే చాలామంది భక్తులు గాయాలపాలవుతారు. విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది. భారీగా పోలీస్ బందోబస్తు బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆదోని, నంద్యాల, కర్నూలు, డోన్ తదితర ప్రాంతాలకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో కలిసి 800 మంది సివిల్ పోలీసులు, ప్రత్యేక బలగాలు, మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అలాగే 200 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించడానికి 120కు పైగా సీసీ, 4 డ్రోన్ కెమెరాలు వినియోగించనున్నారు. పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షంచనున్నారు. ఉత్సవ వివరాలు ► ఈ నెల 5వ తేదీ బుధవారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం ► బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జైత్రయాత్ర మొదలు ► 6వ తేదీ ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి వినిపిస్తారు ► 7వ తేదీ నెరణికి గ్రామ పురోహితులు స్వామి వారికి అర్చనలు చేస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. ► 8న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన ఉంటాయి. ► 9న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే... పురాతన కాలంలో విష పురుగులు, జంతువుల బారి నుంచి రక్షణ పొందేందుకు దివిటీలు, కట్టెలతో భక్తులు కొండపైకి వెళ్లేవారు. మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు తమ చేతిలో ఉన్న కర్రలతో దేవుడి విగ్రహాలను తాకేందుకు పోటీ పడతారు. ఈ సమయంలో కర్రలు తగులుకుని శబ్దం వస్తుంది. నాటుసారా, మద్యం సేవించిన వారు చేతిలోని కర్రలు స్వాధీనంలో లేకుండా మరొకరికి తగిలి గాయాలవుతాయి. గతంలో కొందరు ఉద్దేశపూర్వకంగా గుంపులో కొట్టుకునేందుకు ప్రయత్నించే వారు. ఇది రక్తపాతానికి కారణమయ్యేది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. సంప్రదాయం ప్రకారం ఉత్సవం జరుపుకుంటున్నారు. 144 సెక్షన్ అమలు దేవరగట్టుతో పాటు పరిసర గ్రామాల్లో ఈ నెల 9వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పోలీసు నిబంధనలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలి. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే 200 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశాం. – అబ్దుల్‌జహీర్, ఎస్ఐ, హొళగుంద -
దేవరగట్టులో చిందిన రక్తం
హొళగుంద/ఆలూరు రూరల్: దసరా సందర్భంగా బన్ని ఉత్సవంలో భాగంగా మాళ మల్లేశ్వరస్వామిని వశం చేసుకునేందుకు రక్తం చిందేలా జరిగే కర్రల సమరాన్ని ఆపాలని కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేస్తున్న యత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఈ సమరాన్ని ఆపాలని జిల్లా పోలీసు, అధికార యంత్రాంగం విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల ఆంక్షలను కాదని.. సంప్రదాయానిదే పైచేయిగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామిని దక్కించుకునేందుకు పలు గ్రామాల ప్రజలు ఒకరితో ఒకరు పోటీపడుతూ కర్రల చివరన ఇనుప రింగులు తొడిగి .. బన్ని ఉత్సవం (కర్రల సమరం)లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా శుక్రవారం అర్ధరాత్రి బన్ని ఉత్సవం ప్రారంభం కాగా.. శనివారం ఉదయం 6.30 గంటలకు విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగిసింది. కాగా, ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవరగట్టు చుట్టు పక్కల గ్రామాలైన నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లితో పాటు దాదాపు 15 గ్రామాలకు చెందిన భక్తులు ఉత్సవంలో పాల్గొని మొగలాయి ఆడారు. కల్యాణోత్సవం అనంతరం నిర్వహించిన జైత్రయాత్రలో కర్రలు, దివిటీలు తగిలి భక్తుల తలలకు గాయాలయ్యాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించి కర్నూలు, ఆదోని, బళ్లారి ఆస్పత్రులకు రెఫర్ చేశారు. దాదాపు 60 మంది భక్తులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. -
Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..?
హొళగుంద: బన్ని(కర్రల సమరానికి) ఉత్సవానికి దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి పండుగను పురస్కరించుకుని శుక్రవారం అర్ధరాత్రి మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం జైత్రయాత్ర కొనసాగనుంది. భక్తులు డిర్ర్..ర్ర్...గోపరక్...బహుపరాక్ అంటూ కర్రల సమరం నిర్వహించనున్నారు. వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది గట్టుకు వాహనాలను అనుమతించడం లేదు. ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 1,350 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: దసరా పండుగ కళ వచ్చిందయ్యో అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించడానికి వీలుగా 120కు పైగా సీసీ కెమెరాలు అమర్చారు. అలాగే నాలుగు డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. వేడుకల్లో గాయపడే భక్తులకు దేవరగట్టులోని ఓ భవనంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో 10 మంది డాక్టర్లు, 100 మంది వైద్య సిబ్బంది సేవలు అందించనున్నారు. మంచాలు, మెడిసిన్స్, ఇతర అత్యవసర చికిత్సకు కావల్సిన మందులు, పరికరాలతో పాటు 108, 104 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. ఉత్సవం జరుగుతుందిలా.. దేవరగట్టు పరిసర గ్రామాలు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి వర్గ వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా గ్రామపెద్దలు పోలీసులకు బండారాన్ని ఇస్తారు. అనంతరం బాణసంచా పేల్చి కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టుకొని మేళతాళాలతో కాడప్ప మఠానికి చేరుకుంటారు. అక్కడున్న మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో మాత మాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవం జరిపిస్తారు. అనంతరం జైత్రయాత్ర కొనసాగుతుంది. మొగలాయిలో భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి , పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి చాలా మంది గాయపడ్తారు. గాయపడినవారికి స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. చదవండి: ఆనందోత్సవాల ‘ఆసరా’ కొండపై ఆలయం రక్త సంతర్పణ.. ఉత్సవ విగ్రహాలు రక్షపడికి చేరుకున్నాక..అక్కడున్న రెండు రాతి గుండ్లకు కంచాభీరా వంశానికి చెందిన గొరువయ్య ఐదు చుక్కల రక్తాన్ని సమర్పిస్తాడు. బసవన్న గుడి వద్ద ప్రధాన అర్చకుడు గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది. మంచి జరుగుతుందనే ఉద్దేశంతో.. పురాతన కాలంలో విష పురుగులు, జంతువుల బారి నుంచి రక్షణ పొందేందుకు దివిటీలు, కట్టెలతో భక్తులు కొండపైకి వెళ్లేవారు. మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు తమ చేతిలో ఉన్న కర్రలతో దేవుడి విగ్రహాలను తాకేందుకు పోటీ పడతారు. ఈ సమయంలో కర్రలు తగులుకుని శబ్దం వస్తుంది. నాటుసారా, మద్యం సేవించిన వారి చేతిలోని కర్రలు స్వాధీనంలో లేకుండా మరొకరికి తగిలి గాయాలవుతాయి. గతంలో కొందరు ఉద్దేశ పూర్వకంగా గుంపులో కొట్టుకునేందుకు ప్రయత్నించేవారు. ఇది రక్తపాతానికి కారణమయ్యేది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. సంప్రదాయం ప్రకారం ఉత్సవం జరుపుకుంటున్నారు. 144 సెక్షన్ అమలు వేడుకల్లో భాగంగా 19వ తేదీ వరకు దేవరగట్టుతో పాటు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తక్కువ సంఖ్యలో భక్తులు హాజరుకావాలి. ఇప్పటికే 150 మందిపై పోలీసులు బైండోవర్, ఇతర కేసులు నమోదు చేశారు. – శేషఫణీంద్ర, తహసీల్దార్, హొళగుంద అన్ని ఏర్పాట్లు చేశాం బన్ని ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. కొత్తపేట రోడ్డును బాగు చేయించాం. ఉత్సవాల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. – గుమ్మనూరు శ్రీనివాసులు, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ -
కర్రల సమరంపై ఉత్కంఠ; పలుప్రాంతాల్లో 144 సెక్షన్
సాక్షి, కర్నూలు: దసరా వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి కర్నూలు జిల్లా వైపే ఉంటుంది. ఎందుకంటే దసరా పండుగ సందర్భంగా జిల్లాలోని దేవరగట్టు కొండ దగ్గర బన్నీ ఉత్సవం రణరంగం తలపిస్తుంది. ఈ ఉత్సవంలో కర్రలతో ఒకరినొకరు బాదుకుంటూ ఆ ప్రాంతం రక్తసిక్తమవుతుంది. అక్టోబర్ 21 నుంచి 30 వరకు బన్నీ ఉత్సవాలను నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అయితే ఈ ఏడాది దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కర్రల సమరంపై ఉత్కంఠ నెలకొంది. (పంట చేనులో కోటి విలువైన వజ్రం!) అయితే కరోనా మహమ్మారి విజృంభణ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది బన్నీ ఉత్సవాలను పోలీసులు నిషేదించారు. అయితే స్వామి వారి పూజా కార్యక్రమాలు మాత్రం యధాతథంగా కొనసాగుతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా పండుగను కుటుంబ సభ్యులతో ఇళ్లలోనే జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఆలూరు, హోలగొంద, ఆస్పరి, మండలాలలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. -
దేవరగట్టులో బన్నీ ఉత్సవం
-
బన్నీ ఉత్సవంలో విషాదం
-
బన్నీ ఉత్సవంలో విషాదం
కర్నూలు : దసరా సందర్భంగా కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో శనివారం రాత్రి బన్నీ ఉత్సవం (కర్రల సమరం) జరిగింది. ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద జరిగిన ఈ సమరంలో సులువాయికి చెందిన ఈరన్న అనే వ్యక్తి మృతిచెందగా మరో 60 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరులకు విజయదశమి పర్వదినాన రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లోని పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఉత్సవం సందర్భంగా రక్తపాతం జరగకుండా చూసేందుకు దాదాపు 1200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయినప్పటికీ కాగడాలు అంటుకుని ఒకరు మృతిచెందగా కర్రల దాడిలో 60 మంది గాయాలపాలయ్యారు. -
దేవరగట్టులో కర్రల సమరానికి రె'ఢీ'
కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల ఉత్సవానికి అంతా సిద్ధమైంది. దేవరగట్టులో కొలువై ఉన్న మాలమల్లేశ్వరుడి కళ్యాణోత్సవం అనంతరం గ్రామస్థులు అంతా ఒకచోటకు చేరుకుని కర్రలతో కొట్టుకుంటారు. ఈ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అయితే భక్తులు మాత్రం ఈ బన్నీ ఉత్సవాన్ని చాలా సంబరంగా చేసుకుంటామని, ఇది ఒక ఉత్సవం మాత్రమే తప్ప ఎలాంటి ఆవేశ కావేషాలకు ఇందులో తావిచ్చేది లేదని అంటున్నారు. ప్రతియేటా జరిగే ఈ ఉత్సవంలో తమకు ఎవరికీ ప్రమాదకరమైన గాయాలు మాత్రం కావట్లేదని వాదిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం రక్తపాతం జరగడం సరికాదని, అందుకే తాము 144 సెక్షన్ విధించామని చెబుతున్నారు.