'రుద్రమదేవి' మీదే ఆధారపడ్డారు! | akhil, bruslee, rudhramadevi planing for dasara release | Sakshi
Sakshi News home page

'రుద్రమదేవి' మీదే ఆధారపడ్డారు!

Published Tue, Sep 8 2015 9:21 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

'రుద్రమదేవి' మీదే ఆధారపడ్డారు! - Sakshi

'రుద్రమదేవి' మీదే ఆధారపడ్డారు!

టాలీవుడ్  చిత్ర పరిశ్రమకు  దసరా సీజన్ చాలా ఇంపార్టెంట్. అందుకే స్టార్ హీరోలు కూడా ఈ సీజన్ లో తమ సత్తా చాటలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ ఏడాది దసరా  దగ్గర పడుతున్నా ఇంతవరకు సినిమాల రిలీజ్ లు మాత్రం ఫైనల్ కాలేదు. రుద్రమదేవి, అఖిల్, బ్రూస్లీ లాంటి సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్న పండుగ బరిలో ఏ ఏ సినిమాలు నిలుస్తాయనేది ఇంకా స్పష్టత లేదు.

ఇక దసరాకు  తప్పక విడుదల కావాల్సిన పరిస్థితిలో ఉన్న సినిమా రుద్రమదేవి. అనుష్క ప్రదాన పాత్రలో గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా అక్టోబర్ 9న రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్, రానాలు కూడా నటించడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. రుద్రమదేవి రిలీజ్ దాదాపుగా ఫైనల్ కావటంతో దసరా బరిలోనే దిగాలనుకున్న ఇతర హీరోలు ఆలోచనలో పడ్డారు.

అదే సమయంలో విడుదల కు రెడీ అవుతున్న మరో సినిమా బ్రూస్లీ. రామ్ చరణ్.. శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాను అక్టోబర్ 15 న  ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే రుద్రమదేవి 9కే రిలీజ్ అయితే ఆ సినిమా కలెక్షన్లతో పోటీ పడకుండా బ్రూస్లీని కాస్త ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాను కూడా దసరాకే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ బ్రూస్లీ వాయిదా పడితే అఖిల్ సినిమాకు పోటీ అవుతుందన్న ఆలోచనతో మరోసారి రిలీజ్ డేట్ విషయంలో ఆలోచనలో పడ్డారట చిత్రయూనిట్.. దీంతో రుద్రమదేవి అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అన్నదాన్నిబట్టే చరణ్, అఖిల్ సినిమాల రిలీజ్ లు ఆధారపడి ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement