ఫైట్లు కంటే డ్యాన్సులు బాగుంటాయి: నాగ్ | Akhil's debut for dasara release, says nagarjuna | Sakshi
Sakshi News home page

ఫైట్లు కంటే డ్యాన్సులు బాగుంటాయి: నాగ్

Published Thu, Sep 10 2015 9:09 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

ఫైట్లు కంటే డ్యాన్సులు బాగుంటాయి: నాగ్ - Sakshi

ఫైట్లు కంటే డ్యాన్సులు బాగుంటాయి: నాగ్

విజయవాడ : విజయదశమికి 'అఖిల్' సినిమా విడుదల అవుతుందని హీరో నాగార్జున తెలిపారు. కల్యాణ్ జ్యూయలర్స్ 7 స్టార్ సెలబ్రేషన్స్‌ను ఆయన నిన్న విజయవాడలో ప్రారంభించారు.  ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ అఖిల్ చిత్రంలో ఫైట్‌లు కంటే డ్యాన్సులు చాలా బాగుంటాయన్నారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్...వీవీ వినాయక్ దర్శకత్వంలో వెండి తెరకు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.  అఖిల్‌ అక్కినేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'అఖిల్' . 'ది పవర్‌ ఆఫ్‌ జువా...' అనేది ట్యాగ్ లైన్. సాయేషా సైగల్‌ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి హీరో నితిన్‌ నిర్మాత. విజయదశమి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement