bruslee
-
దానికి ఆడామగ తారతమ్యం ఎందుకు ?
చెన్నై : మద్యం తాగడం మంచిది కాదు. అలాంటిది ఆడ, మగ తారతమ్యం ఏమిటీ? అంటోంది నటి రకుల్‌ప్రీత్ సింగ్. తమిళంలో ఎన్నమో ఏదో, పత్తగం చిత్రాల హీరోయిన్ రకుల్‌ప్రీత్ గుర్తుందా? కోలీవుడ్‌లో అంతగా పేరు తెచ్చుకోలేక పోయినా ఇప్పుడీ బ్యూటీ టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్. ఎంతగా అంటే అక్కడ సమంత, కాజల్ అగర్వాల్ లాంటి టాప్ హీరోయిన్లను కూడా అధిగమించిందనే చెప్పాలి. టాలీవుడ్ ప్రముఖ యువ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రొమాన్స్ చేస్తూ యమ జోష్‌లో ఉంది. రామ్‌చరణ్‌తో నటించిన బ్రూస్లీ ఇటీవల విడుదలైంది.ఈ సందర్భంగా ఇటీవల చెన్నైకి వచ్చిన రకుల్‌ప్రీత్ హీరోయిన్లు మద్యం సేవించడంపై మీ అభిప్రాయం ఏమిటని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మద్యం తాగడమే మంచిది కాదు. అందులో ఆడ, మగ తారతమ్యం ఏమిటీ అని ప్రశ్నించారు. మద్యం సేవించి రోడ్ల మీద తిరిగితే పిచ్చోళ్లు అనుకంటారు. తనకు మద్యం అలవాటు లేదు. ఇతరుల గురించి తాను ఏమీ కామెంట్ చేయను. ఎందుకంటే అది వారి వారి ఇష్టాలకు సంబంధించిన విషయం అన్నారు. చాలా గ్యాప్ తరువాత బ్రూస్లీ-2(తెలుగు చిత్రం బ్రూస్లీ కి అనువాదం)ద్వారా తమిళ పేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉన్నా ఇక్కడ మంచి చిత్రాలు చేయాలన్న కోరిక మాత్రం బలంగా ఉందని రకుల్‌ప్రీత్ పేర్కొంది. టాలీవుడ్లో మాదిరి కోలీవుడ్‌లోనూ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని అంది. -
'రుద్రమదేవి' మీదే ఆధారపడ్డారు!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దసరా సీజన్ చాలా ఇంపార్టెంట్. అందుకే స్టార్ హీరోలు కూడా ఈ సీజన్ లో తమ సత్తా చాటలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ ఏడాది దసరా దగ్గర పడుతున్నా ఇంతవరకు సినిమాల రిలీజ్ లు మాత్రం ఫైనల్ కాలేదు. రుద్రమదేవి, అఖిల్, బ్రూస్లీ లాంటి సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న పండుగ బరిలో ఏ ఏ సినిమాలు నిలుస్తాయనేది ఇంకా స్పష్టత లేదు. ఇక దసరాకు తప్పక విడుదల కావాల్సిన పరిస్థితిలో ఉన్న సినిమా రుద్రమదేవి. అనుష్క ప్రదాన పాత్రలో గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా అక్టోబర్ 9న రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్, రానాలు కూడా నటించడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. రుద్రమదేవి రిలీజ్ దాదాపుగా ఫైనల్ కావటంతో దసరా బరిలోనే దిగాలనుకున్న ఇతర హీరోలు ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో విడుదల కు రెడీ అవుతున్న మరో సినిమా బ్రూస్లీ. రామ్ చరణ్.. శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాను అక్టోబర్ 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే రుద్రమదేవి 9కే రిలీజ్ అయితే ఆ సినిమా కలెక్షన్లతో పోటీ పడకుండా బ్రూస్లీని కాస్త ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాను కూడా దసరాకే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ బ్రూస్లీ వాయిదా పడితే అఖిల్ సినిమాకు పోటీ అవుతుందన్న ఆలోచనతో మరోసారి రిలీజ్ డేట్ విషయంలో ఆలోచనలో పడ్డారట చిత్రయూనిట్.. దీంతో రుద్రమదేవి అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అన్నదాన్నిబట్టే చరణ్, అఖిల్ సినిమాల రిలీజ్ లు ఆధారపడి ఉన్నాయి. -
రొమాంటిక్ హీరోగా చెర్రీ
మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రామ్‌చరణ్ రొమాంటిక్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. గతంలో ఇదే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాకపోవటంతో లాంగ్ గ్యాప్ తీసుకొని మరోసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు రెడీ అవుతున్నాడు. ఫీల్ గుడ్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న టాప్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. 'బ్రూస్లీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టంట్ మాస్టర్ గా నటిస్తున్న చెర్రీ ఆ క్యారెక్టర్ కోసం రిస్కీ స్టంట్స్ కూడా చేస్తున్నాడు. చరణ్ కెరీర్లో ఒక్క 'ఆరెంజ్' తప్ప మిగతా సినిమాలన్నీ మాస్ యాక్షన్ జానర్ లో రూపొందినవే. కొత్తగా ప్రయత్నించిన ఆరెంజ్ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవటంతో, తరువాత అలాంటి ప్రయత్నం చేయటమే మానేశాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఇప్పుడు మరోసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఆ జానర్ సినిమాలు చేయటంలో స్పెషలిస్ట్ గా పేరున్న గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నాడు. గౌతమ్ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా పూర్తవ్వగానే చరణ్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టనున్నాడు. ఈ లోగా చరణ్ కూడా 'బ్రూస్లీ' షూటింగ్ పూర్తి చేసి నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటికే సురేందర్ రెడ్డి తో సినిమా అంగీకరించిన చరణ్ ఏ సినిమాను స్టార్ట్ చేయనున్నాడో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
బాబాయ్ బర్త్‌డేకి అబ్బాయ్ గిప్ట్
మెగా ఫ్యామిలీలో వివాదాలు సమసిపోయినట్లే కనిపిస్తోంది. అయితే చిరంజీవి 60 వ పుట్టిన రోజు వేడుకలు ఈ వివాదానికి మెగా ఫ్యామిలీ తెర దించినట్లు సమాచారం. ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు దూరంగా ఉంటూ వస్తున్న పవన్ కల్యాణ్‌కు ఇటీవల సోదరుడు చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. అంతేకాకుండా చిరంజీవి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో పవన్ కల్యాణ్ సుమారు గంటపాటు గడిపారు. కాగా పవన్ కల్యాణ్‌కు మెగా బ్రదర్స్ తో పడటం లేదన్న వార్త చాలా రోజులుగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే అన్నయ్య బర్త్‌డే వేడుకకు హాజరైన పవన్ ...మెగా ఫ్యామిలీతో తానెప్పుడూ కలిసే ఉంటానని స్పష్టం చేశాడు. తాజాగా బాబాయ్ పుట్టినరోజుకు...అబ్బాయి ...మెగా అభిమానులకు గిప్ట్ ఇచ్చాడు. బాబాయ్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమా బ్రూస్లీ టీజర్ రిలీజ్ చేసిన చెర్రీ మరోసారి మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అనే సందేశాన్ని పంపాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీ స్టంట్ మాస్టర్‌గా కనిపిస్తున్నాడు. మాస్ ఆడియన్స్‌కు నచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఎమోషన్స్, లవ్ ఎలిమెంట్స్ తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా బ్రూస్ లీ ని రెడీ చేశారు. అక్టోబర్ మూడో వారంలో ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. -
అక్టోబర్ లో బన్నీ వర్సెస్ చెర్రీ
ఈ అక్టోబర్ లో టాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్ ఫైట్ జరగనుంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు మెగా హీరోలు వెండితెర మీద తలపడటానికి రెడీ అవుతుండటంతో అక్టోబర్ రిలీజ్ ల పై అందరి దృష్టి పడింది. అల్లు అర్జున్ కీ రోల్ లో నటిస్తున్న రుద్రమదేవి, చాలా వాయిదాల తరువాత అక్టోబర్ లో రిలీజ్ అవుతుండగా రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్ లీ మూవీ కూడా దాదాపు అదే సమయంలో రిలీజ్ కానుంది. గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడి ఫిలిం రుద్రమదేవి. అనుష్క ప్రదాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తున్నాడు. రుద్రమదేవి యూనిట్ మొత్తంలో భారీ మార్కెట్ ఉంది బన్నీ కే కావటంతో యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్ విషయంలో ఎక్కువగా బన్నీ పేరును వాడుతున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 9 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక గత ఏడాది రెండు బిగ్ హిట్స్ తో అలరించిన చెర్రీ లాంగ్ గ్యాప్ తరువాత బ్రూస్ లీగా ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఆగడు లాంటి భారీ డిజాస్టర్ తరువాత శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సక్సెస్ తన కెరీర్ కు చాలా కీలకం కానుంది. దీంతో ఎంతో జాగ్రత్తగా చరణ్ మార్క్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు అక్టోబర్ 16 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేయాలని భావిస్తున్నాడు చెర్రీ. ఇలా ఇద్దరు మెగా హీరోల సినిమాలు వారం గ్యాప్ లో రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. మరి అనుకున్నట్టుగా ఇద్దరు ఒకేసారి బరిలో దిగుతారా లేక ఎవరో ఒకరు వెనుకడుగు వేస్తారా చూడాలి.