బాబాయ్ బర్త్డేకి అబ్బాయ్ గిప్ట్ | Ramcharan gift on Pawan Kalyan Birthday | Sakshi
Sakshi News home page

బాబాయ్ బర్త్డేకి అబ్బాయ్ గిప్ట్

Sep 2 2015 12:30 PM | Updated on Mar 22 2019 5:33 PM

బాబాయ్ బర్త్డేకి అబ్బాయ్ గిప్ట్ - Sakshi

బాబాయ్ బర్త్డేకి అబ్బాయ్ గిప్ట్

మెగా ఫ్యామిలీలో వివాదాలు సమసిపోయినట్లే కనిపిస్తోంది. అయితే చిరంజీవి 60 వ పుట్టిన రోజు వేడుకలు ఈ వివాదానికి మెగా ఫ్యామిలీ తెర దించినట్లు సమాచారం. ఫ్యామిలీ...

మెగా ఫ్యామిలీలో వివాదాలు సమసిపోయినట్లే కనిపిస్తోంది. అయితే చిరంజీవి 60 వ పుట్టిన రోజు వేడుకలు ఈ వివాదానికి మెగా ఫ్యామిలీ తెర దించినట్లు సమాచారం.  ఫ్యామిలీ ఫంక్షన్స్కు దూరంగా ఉంటూ వస్తున్న పవన్ కల్యాణ్కు ఇటీవల సోదరుడు చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమానికి  హాజరైన విషయం తెలిసిందే. అంతేకాకుండా చిరంజీవి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో పవన్ కల్యాణ్ సుమారు గంటపాటు గడిపారు. కాగా  పవన్ కల్యాణ్కు మెగా బ్రదర్స్ తో పడటం లేదన్న వార్త చాలా రోజులుగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే అన్నయ్య  బర్త్డే వేడుకకు హాజరైన పవన్ ...మెగా ఫ్యామిలీతో తానెప్పుడూ కలిసే ఉంటానని స్పష్టం చేశాడు.

తాజాగా బాబాయ్ పుట్టినరోజుకు...అబ్బాయి ...మెగా అభిమానులకు గిప్ట్ ఇచ్చాడు.  బాబాయ్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమా బ్రూస్లీ టీజర్ రిలీజ్ చేసిన  చెర్రీ మరోసారి మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అనే సందేశాన్ని పంపాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమాలో చెర్రీ స్టంట్ మాస్టర్గా కనిపిస్తున్నాడు. మాస్ ఆడియన్స్కు నచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే ఎమోషన్స్, లవ్ ఎలిమెంట్స్ తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా బ్రూస్ లీ ని రెడీ చేశారు. అక్టోబర్ మూడో వారంలో ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement