రానా బర్త్‌డే: భీమ్లానాయక్‌ నుంచి డేనియల్‌ స్పెషల్‌ వీడియో | Rana Daggubati Birthday: Rana Special Video Release From Bhemmla Nayak Movie | Sakshi
Sakshi News home page

Rana Daggubati Birthday: భీమ్లానాయక్‌ నుంచి డేనియల్‌ స్పెషల్‌ వీడియో

Published Tue, Dec 14 2021 8:32 PM | Last Updated on Tue, Dec 14 2021 9:16 PM

Rana Daggubati Birthday: Rana Special Video Release From Bhemmla Nayak Movie - Sakshi

Rana Daggubati Special Video Release From Bheemla Nayak Movie: టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌ల వస్తున్న మల్టిస్టారర్‌ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో అనేది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందనేది ఈ మూవీ కథ. ఈ రోజు(డిసెంబర్‌ 14) రానా బర్త్‌డే సందర్భంగా చిత్రం బృందం ఓ ఇంట్రెస్టింగ్‌ వీడియోను వదిలింది. రానాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.

చదవండి: నాని శ్యామ్‌ సింగరాయ్‌ ట్రైలర్‌ వచ్చేసింది

‘వాడు అరిస్తే భయపడతావా.. ఆడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్ఐ.. సస్పెండెడ్’ అంటూ రానా ఆవేశంతో చెప్పే డైలాగ్‌తో ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూస్తుంటే ఇందులో రానా  పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందనేది అర్థమైపోతుంది. ఇందులో రానా డేనియల్ శేఖర్‌ నెగిటివ్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో పవన్ సరసన హీరోయిన్‌గా నిత్యామీనన్ నటిస్తుండగా.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement