దానికి ఆడామగ తారతమ్యం ఎందుకు ?
చెన్నై : మద్యం తాగడం మంచిది కాదు. అలాంటిది ఆడ, మగ తారతమ్యం ఏమిటీ? అంటోంది నటి రకుల్‌ప్రీత్ సింగ్. తమిళంలో ఎన్నమో ఏదో, పత్తగం చిత్రాల హీరోయిన్ రకుల్‌ప్రీత్ గుర్తుందా? కోలీవుడ్‌లో అంతగా పేరు తెచ్చుకోలేక పోయినా ఇప్పుడీ బ్యూటీ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్. ఎంతగా అంటే అక్కడ సమంత, కాజల్ అగర్వాల్ లాంటి టాప్ హీరోయిన్లను కూడా అధిగమించిందనే చెప్పాలి. టాలీవుడ్ ప్రముఖ యువ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌లతో రొమాన్స్ చేస్తూ యమ జోష్‌లో ఉంది.
రామ్‌చరణ్‌తో నటించిన బ్రూస్‌లీ ఇటీవల విడుదలైంది.ఈ సందర్భంగా ఇటీవల చెన్నైకి వచ్చిన రకుల్‌ప్రీత్ హీరోయిన్లు మద్యం సేవించడంపై మీ అభిప్రాయం ఏమిటని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మద్యం తాగడమే మంచిది కాదు. అందులో ఆడ, మగ తారతమ్యం ఏమిటీ అని ప్రశ్నించారు. మద్యం సేవించి రోడ్ల మీద తిరిగితే పిచ్చోళ్లు అనుకంటారు. తనకు మద్యం అలవాటు లేదు. ఇతరుల గురించి తాను ఏమీ కామెంట్ చేయను.
ఎందుకంటే అది వారి వారి ఇష్టాలకు సంబంధించిన విషయం అన్నారు. చాలా గ్యాప్ తరువాత బ్రూస్‌లీ-2(తెలుగు చిత్రం బ్రూస్‌లీ కి అనువాదం)ద్వారా తమిళ పేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉన్నా ఇక్కడ మంచి చిత్రాలు చేయాలన్న కోరిక మాత్రం బలంగా ఉందని రకుల్‌ప్రీత్ పేర్కొంది. టాలీవుడ్‌లో మాదిరి కోలీవుడ్‌లోనూ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని అంది.