ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో రకుల్ హల్చల్ | tollywood heroine rakul preet singh hulchul in hyderabad traffic training institute | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో రకుల్ హల్చల్

Published Tue, Mar 29 2016 2:36 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో రకుల్ హల్చల్ - Sakshi

ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో రకుల్ హల్చల్

హైదరాబాద్ : టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో మంగళవారం సందడి చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకి అవగాహన చేసేందుకు గోషామహల్ ఇనిస్టిట్యూట్కు చేరుకున్న రకుల్ సరదాగా బైక్ నడిపి హల్చల్ చేసింది.

ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ...ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. నగర పోలీసులు చేపడుతున్న  ప్రత్యేక చొరవతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని... ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్, డీసీపీ రంగనాథ్తో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వాహనచోదకులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నట్లు డీసీపీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement