అక్టోబర్ లో బన్నీ వర్సెస్ చెర్రీ
ఈ అక్టోబర్ లో టాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్ ఫైట్ జరగనుంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు మెగా హీరోలు వెండితెర మీద తలపడటానికి రెడీ అవుతుండటంతో అక్టోబర్ రిలీజ్ ల పై అందరి దృష్టి పడింది. అల్లు అర్జున్ కీ రోల్ లో నటిస్తున్న రుద్రమదేవి, చాలా వాయిదాల తరువాత అక్టోబర్ లో రిలీజ్ అవుతుండగా రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్ లీ మూవీ కూడా దాదాపు అదే సమయంలో రిలీజ్ కానుంది.
గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడి ఫిలిం రుద్రమదేవి. అనుష్క ప్రదాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తున్నాడు. రుద్రమదేవి యూనిట్ మొత్తంలో భారీ మార్కెట్ ఉంది బన్నీ కే కావటంతో యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్ విషయంలో ఎక్కువగా బన్నీ పేరును వాడుతున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 9 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
ఇక గత ఏడాది రెండు బిగ్ హిట్స్ తో అలరించిన చెర్రీ లాంగ్ గ్యాప్ తరువాత బ్రూస్ లీగా ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఆగడు లాంటి భారీ డిజాస్టర్ తరువాత శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సక్సెస్ తన కెరీర్ కు చాలా కీలకం కానుంది. దీంతో ఎంతో జాగ్రత్తగా చరణ్ మార్క్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు అక్టోబర్ 16 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేయాలని భావిస్తున్నాడు చెర్రీ.
ఇలా ఇద్దరు మెగా హీరోల సినిమాలు వారం గ్యాప్ లో రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. మరి అనుకున్నట్టుగా ఇద్దరు ఒకేసారి బరిలో దిగుతారా లేక ఎవరో ఒకరు వెనుకడుగు వేస్తారా చూడాలి.